నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్‌లో చూడబోతున్నాం. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ తో ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ చుస్తే ఈసారి వైలెన్స్‌కే వణుకు పుట్టించేలా ఉన్నాడు నాని. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని.
Also Read : Supritha : కళ్ళతోనే సెగలు పుట్టిస్తున్న సురేఖ వాణి కూతురు
కాగా హిట్ 3 వరల్డ్ వైడ్ గా మే 1న రిలీజ్ కానుంది. రిలీజ్ కు వారం మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మేకర్స్. అయితే ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హిట్ 3 కు సెన్సార్ సభ్యులు A సర్టిఫికెట్ అందించారు. సినిమాలో హింస, రక్తపాతం, వైలెన్స్ ఎక్కువగా ఉందని ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసారు. 13 సంవత్సరాల కంటే తక్కవ వయసు ఉన్న వారికి అనుమతి లేదని చిన్న పిల్లలు ఈ సినిమాకు దూరంగా ఉండాలని సూచించింది. నాని స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా కావడంతో ప్రమోషన్స్ ను భారీ ఎత్తున జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు నాని. ఈ హిట్ సిరీస్ లోని తోలి రెండు బాగాలు హిట్ కావడంతో పాటు నేచురల్ స్టార్ మోస్ట్ వాయిలెంట్ గా కనిపిస్తుండడం సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్ తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి అంచనాలు హిట్ 3 ఏ మాత్రం అందుకుంటదో మరోక వారం రోజుల్లో తెలుస్తుంది.