దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు నిరంతరం ప్రజలకు మాస్కులు ధరించమని కోరుతూ వివిధ మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల పూణే పోలీసులు ప్రజల్లో మాస్కులు ధరించమని, కరోనా గురించి అవగాహనను పెంచడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకున్నారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో పూణే పోలీసుల తీరుపై నటి కరీనా కపూర్ ఖాన్ స్పందించారు. తన తాత, లెజెండరీ నటుడు రాజ్ కపూర్ చిత్రం ‘మేరా నామ్ జోకర్’ ఆధారంగా పూణే పోలీసులు రూపొందించిన COVID-19 ప్రచార వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. దానికి “గొప్ప వీడియో” అని క్యాప్షన్ ఇచ్చింది.
Read Also : కథక్ మాస్ట్రో పండిట్ బిర్జూ మహారాజ్ ఇక లేరు
కరీనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పూణే పోలీసుల వీడియోను పంచుకున్నారు. ఇందులో ఒక పోలీసు ‘ఏ భాయ్ జరా దేఖ్ కే చలో’ పాటను ట్విస్ట్‌తో పాడుతున్నట్లు కనిపించింది. ఈ వీడియోలో పోలీసు కొత్త లిరిక్స్‌తో పాటను పాడుతూ చిన్న జలుబు అని తేలికగా భావించకుండా మాస్క్ ధరించమని పాట రూపంలో కోరుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)
1970లో రాజ్‌కుమార్ చిత్రం ‘మేరా నామ్ జోకర్’ విడుదలైంది. ఆర్‌కే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథను ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ రాశారు. ఈ చిత్రంలో రాజ్ కపూర్, సిమి గరేవాల్, రిషి కపూర్, క్సేనియా ర్యాబింకినా, పద్మిని, మనోజ్ కుమార్, ధర్మేంద్ర, దారా సింగ్, రాజేంద్ర కుమార్ నటించారు. కరీనా, కరిష్మా కపూర్ రాజ్ కపూర్ పెద్ద కుమారుడు అయిన ప్రముఖ నటుడు రణధీర్ కపూర్ కుమార్తెలు. ఇక ఇటీవలే కరీనా కపూర్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.