Kantara Chapter 1 : హీరో రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన కాంతార చాప్టర్1 భారీ హిట్ అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా ఏకంగా రూ.509 కోట్లను వసూలు చేసింది. ఈ స్థాయిలో రిషబ్ కెరీర్ లోనే ఏ సినిమా వసూలు చేయలేదు. అయితే సినిమా కన్నడ ఇండస్ట్రీలో టాప్ కలెక్షన్లను వసూలు చేస్తుందేమో అని ఆశించినా.. పెద్దగా ఫలితం దక్కలేదు. మూవీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కానీ ఇది ఆ సినిమా స్థాయికి పర్వాలేదు అనే చెప్పుకోవాలి. కన్నడలో ఇప్పటి వరకు హయ్యెస్ట్ కలెక్షన్లు యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్-2 రూ.1200 కోట్లు. దాని తర్వాత కాంతార చాప్టర్ 1 కలెక్షన్లు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో కూడా కాంతార కలెక్షన్లు రూ.450 కోట్లు ఉన్నాయి.
Read Also : SS Rajamouli : ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్ ను చూసి రాజమౌళి ఏం అనుకున్నాడో తెలుసా..?
నాలుగో స్థానంలో కేజీఎఫ్ -1 కలెక్షన్లు రూ.250 కోట్లు ఉన్నాయి. కాంతార చాప్టర్ 1 వచ్చి ఆల్రెడీ వారం దాటిపోయింది. కాబట్టి ఈ సినిమా కేజీఎఫ్-2 కలెక్షన్లను బ్రేక్ చేయడం కష్టమే. కాకపోతే ఇంకో రూ.150 కోట్ల దాకా వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిషబ్ శెట్టి కెరీర్ లో ఈ సినిమా కలెక్షన్లే ఎక్కువ. కాంతార సినిమా కూడా బాగానే వసూలు చేసింది. ఆ లెక్కన చూస్తే చాప్టర్1 కు వచ్చిన కలెక్షన్లు పెద్ద గొప్పేం కాకపోవచ్చు. ఇది కన్నడలో రెండో అతిపెద్ద సినిమాగా మాత్రం నిలిచిపోతుంది. రిషబ్ శెట్టికి ఇది మంచి బూస్ట్ ఇచ్చే సినిమానే. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇక కేజీఎఫ్-3 వస్తే మాత్రం ఆ కలెక్షన్లు ఊహకు కూడా అందడం కష్టమే.
Read Also : SS Rajamouli : రాజమౌళి తీసిన సినిమాకు డిజాస్టర్ టాక్.. చివరకు..
