SS Rajamouli : జక్కన్న కెరీర్ లో ఇప్పటి వరకు ప్లాప్ అనే విషయమే లేదు. తీసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. ఒకదాన్ని మించి మరొకటి ఆడుతుంటాయి. ఆయన రికార్డులను తిరగరాయాలంటే మళ్లీ ఆయనతోనే సాధ్యం. అలాంటి రాజమౌళి తీసిన భారీ బడ్జెట్ మూవీ మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నిజమేనండి బాబు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. నేను తీసిన తొలి పాన్ ఇండియా ఫిల్మ్ బాహుబలి ది బిగినింగ్. ఆ సినిమాపై భారీ నమ్మకం పెంచుకున్నాం. తెలుగుతో పాటు దేశ వ్యాప్తంగా, ప్రపంచంలో కొన్ని దేశాల్లో రిలీజ్ చేశాం. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ కలెక్షన్లు వస్తాయనేది మా నమ్మకం. కానీ తొలి రోజు అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది.
Read Also : Bigg Boss 9 : వైల్డ్ కార్డు ద్వారా కాంట్రవర్సీ కంటెస్టెంట్లు.. ఇక రచ్చ రచ్చే..
తెలుగులో మాత్రం డిజాస్టర్ టాక్ వచ్చింది. ఫస్ట్ షో చూసిన వారంతా నెగెటివ్ టాక్ ఇచ్చారు. అతిపెద్ద ప్లాప్ అన్నారు. అది విని నా మైండ్ పనిచేయలేదు. చాలా బాధపడ్డాను. ఎందుకంటే నన్ను నమ్మి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని చాలా ఖర్చు చేశారు. మూడేళ్ల పాటు అందరం కష్టపడ్డాం. అదంతా ఉత్తదేనా అనుకున్నాను. కానీ మెల్లిగా హిట్ టాక్ లోకి మూవీ వచ్చేసింది. రెండో పార్టుపై భారీ అంచనాలను పెంచేసింది. అప్పుడు మళ్లీ ఊపిరి పీల్చుకున్నాం అంటూ తెలిపాడు రాజమౌళి. అతను చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. బాహుబలి ది బిగినింగ్ సినిమా తెలుగు సినిమా రూపరేఖలను మార్చేసింది. అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Read Also : TG Vishwaprasad : అకీరాతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ