SS Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. విదేశాల్లో స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. అయితే నేడు రాజమౌళి 52వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజమౌళి లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మొదటి సినిమా చేసింది ఎన్టీఆర్ తోనే. స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా చేయడం కోసం ఎన్టీఆర్ తో ఛాన్స్ వచ్చిందంట రాజమౌళికి. దీంతో ఎన్టీఆర్ ను కలిసేందుకు రాజమౌళి వెళ్లాడు. అప్పటి వరకు సీరియల్స్ కు డైరెక్టర్ గా చేస్తున్నారు. ఫస్ట్ సినిమా ఛాన్స్ కావడంతో ఎలాగైనా మంచి హిట్ కొట్టి కెరీర్ ను నిలబెట్టుకోవాలనే ఆలోచనలతో రాజమౌళి ఉన్నాడు.
Read Also : SS Rajamouli : రాజమౌళి తీసిన సినిమాకు డిజాస్టర్ టాక్.. చివరకు..
స్టూడెంట్ నెంబర్ సినిమా కంటే ముందే ఎన్టీఆర్ కొంచెం లావుగా ఉన్నాడు. అతన్ని చూసిన రాజమౌళి.. ‘వీడు దొరికాడేంట్రా’ అనుకున్నాడంట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కానీ హీరో ఎలా ఉన్నా బాగా ప్రజెంట్ చేస్తే తనకు మరింత మంచి పేరు వస్తుంది కదా అనుకుని సినిమాకు బలవంతంగానే ఓకే చెప్పాడు రాజమౌళి. కానీ సినిమా సెట్స్ లోకి వచ్చాక ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్, డ్యాన్స్ చూసి రాజమౌళికి మతి పోయిందంట. తాను అంచనా వేసింది తప్పు అని.. డైమండ్ లాంటి యాక్టర్ దొరికాడని ఫుల్ హ్యాపీ అయ్యాడంట జక్కన్న. ఎన్టీఆర్ హార్డ్ వర్క్ చూసి రాజమౌళి ఫిదా అయిపోయాడు. ఆ సినిమా హిట్ అయిన తర్వాత.. ఎన్టీఆర్ తోనే మళ్లీ సింహాద్రి మూవీ చేశాడు ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత యమదొంగ, మొన్న త్రిబుల్ ఆర్ సినిమాలు కూడా చేశాడు. రాజమౌళి తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసింది కూడా ఎన్టీఆర్ తోనే.
Read Also : Bigg Boss 9 : వైల్డ్ కార్డు ద్వారా కాంట్రవర్సీ కంటెస్టెంట్లు.. ఇక రచ్చ రచ్చే..