కన్నడ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి చైత్ర జె ఆచార్ ఇప్పుడు నేరుగా తెలుగు తెరపైకి అడుగుపెట్టబోతున్నది. ‘సప్తసాగరాలు దాటి – సైడ్ బి’, ‘3బీహెచ్‌కే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ, ప్రస్తుతం ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఫౌజీ”లో కీలక పాత్రలో నటిస్తోందని టాక్. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా కనిపించనుంది. ఇక చైత్ర ఆచార్ పాత్ర మాత్రం కథలో కీలక మలుపు తిప్పే రకమైనదిగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేసినట్లు సమాచారం.
Also Read : chiranjeevi-CP Sajjanar: మెగాస్టార్ డీప్‌ఫేక్ ఘటనపై కఠిన చర్యలు – సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
హను రాఘవపూడి స్టైల్లో మానవ భావోద్వేగాలతో మిళితమైన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా “ఫౌజీ”ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతుండగా, వచ్చే 2026 ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల కానుంది. ప్రభాస్ గెటప్, కథా నేపథ్యం, సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే, చైత్ర ప్రస్తుతం “ఉత్తరకాండ”, “మై లార్డ్”, “స్ట్రాబెర్రీ” వంటి చిత్రాలతో బిజీగా ఉంది. ఇక “ఫౌజీ”లో ఆమె పాత్ర ఆమె కెరీర్‌కు కొత్త మైలురాయిగా నిలుస్తుందనే ఆశలు అభిమానుల్లో ఉన్నాయి.