బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం ఒక రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే. ఒక పక్క వివాదాలు, ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్నా కూడా అమ్మడు ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ ‘లాకప్’ అనే షోకి హోస్ట్‌గా వ్యవహారిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ ఈ షోని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ షో నుంచి రిలీజైన కంగనా పోస్టర్స్ నెట్టింటో వైరల్ గా మారాయి. ఇక తాజాగా ఈ షో గురించి కంగనా మాట్లాడుతూ తన లాకప్ లో ఎవరెవరు ఉండాలో చెప్పుకొచ్చింది.
“ఈ చిత్ర పరిశ్రమలో వినోదాన్ని పంచే చాలామందికి నా లాకప్ లో ఉండే అర్హత ఉంది. ముందుగా నాకెంతో ఇష్టమైన నిర్మాత కరణ్ జోహార్ కి ఆతిథ్యం ఇవ్వాలని ఉంది. ఆ తరువాత అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వీరందరూ లాకప్ కి రావాలని కోరుకుంటున్నాను. అయితే వీరందరూ కూడా ముందు ఆడిషన్స్ ఇచ్చి.. లాకప్ లో ఉండగలరా లేదా అని తెలిశాకనే పోటీకి రావాలని కోరుకుంటున్నాను. ఈ షో కేవలం చిత్ర పరిశ్రమ నుంచి వచ్చేవారికే కాదు ఇందులో రాజకీయ నాయకులు, డిజైనర్లు అందరు పాల్గొనవచ్చు” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ రియాలిటీ షో లో 16 మంది కంటెస్టెంట్లు పాల్గొననున్నట్లు సమాచారం. మరి ఈ వివాదాల రాణి.. ఈ వివాదాల షోతో ఇంకెన్ని వివాదాలను సృష్టిస్తుందో చూడాలి.