Kangana Ranaut: తన డ్రీమ్ ఫుల్ ఫీల్ చేసుకున్న కంగనా.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఎప్పుడు ఏదో ఓ విషయంలో హైలెట్ అవుతూనే ఉంటుంది. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా వ్యాపార రంగంలోనూ తన ప్రతిభ చాటుకోవడానికి సిద్ధం అయ్యింది. ఈ క్రమంలో తాజాగా కంగన్న బిజినెస్ లోకి అడుగుపెడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మనకు తెలిసి చాలా మంది హీరోలు, హీరోయిన్‌లు, ఇతర నటినటులు సినిమాల్లో నటిస్తునే పలు బిజినెస్‌లు కూడా చేపడుతుంటారు. ఇక ఇప్పుడు కంగనా కూడా వారి బాటలో నడుస్తుంది.
Also Read:Thiruveer: వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో..
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
రీసెంట్ గా ఆమె తన మొదటి బిజినెస్ ను సొంత ప్రాంతం హిమాచల్ ప్రదేశ్‌లో ప్రారంభం చేసింది.‘ది మౌంటైన్ స్టోరీ’ పేరుతో హిమాలయాల్లో కేఫ్ స్టార్ట్ చేసింది. ఫిబ్రవరి 14 నుంచి ఇది ప్రారంభం కానుంది. ఈమేరకు రెస్టారంట్ ఫొటోలను వీడియో రూపంలో నెటిజన్‌లతో పంచుకుంది. ‘సంప్రదాయ హిమాచల్ ఫుడ్‌ను మోడ్రన్ అభిరుచులకు అనుగుణంగా అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటుచేశాను. ఇది నా చిన్ననాటి కల ఎట్టకేలకు ప్రాణం పోసుకుంది. ఈ హిమాలయాల ఒడిలో నా చిన్న కేఫ్. ది మౌంటెన్ స్టోరీ.. ఇదొక ప్రేమకథ’ అని ఆమె వీడియో లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే పలువురు హీరోయిన్లు.. శిల్పాశెట్టి, మలైకా అరోరా, మౌనీరాయ్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి తారలకు కూడా రెస్టారంట్లు ఉన్నాయి. మరి కంగనా కు ఈ కేఫ్ ఎంతవరకు లాభం చేకురుస్తుందో చూడాలి.
View this post on Instagram
A post shared by The Mountain Story ( Restaurant ) (@themountainstorytms)
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?