KamalHaasan : నాకు రజనీకాంత్‌కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ సినిమా స్టార్స్ పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు తమిళనాట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విజయ్ సీఎం కావడంపట్ల తనకు ఎలాంటి అనసూయ లేదు…నేను రాజకీయాల్లో లేను. అలాంటప్పుడు విజయ్ను చూసి నేను ఎందుకు అసూయ పడాలి. కమల్ హాసన్ సీఎం ఆయింటే అసూయా ఉండేదేమో అని వ్యాఖ్యానిచారు. తలైవా చేసిన ఈ వ్యాఖ్యలపై కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. రజనీకాంత్‌తో తనకున్న బంధం గురించి అలాగే విజయ్ కొత్త ప్రభుత్వం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ.. “నాకు, రజనీకాంత్‌కు మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉంది. మా మధ్య అసూయ అనేదే లేదు. ఒకవేళ మేము సినిమా రంగంలో కాకుండా క్రికెట్ రంగంలో ఉండి ఉన్నా కూడా మా మధ్య ఇదే రకమైన స్నేహం, పోటీ ఉండేవి” అంటూ దశాబ్దాలుగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని కమల్ హాసన్ మరోసారి గుర్తుచేశారు. ఇక తమిళనాడు నూతన సీఎం సినీనటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం ప్రభుత్వాన్నుద్దేసిస్తూ “పదవిలోకి వచ్చిన రెండు రోజులకే విజయ్ పరిపాలన ఎలా ఉంది? అని అడిగితే ఏం చెప్తాం? ఒకవేళ ఇప్పుడే దాని గురించి మాట్లాడితే అది కేవలం జ్యోతిష్యం చెప్పినట్లే అవుతుంది తప్ప వాస్తవం కాదు. కొత్తగా వచ్చిన వారిని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు అలాగని వారి నుండి మరీ ఎక్కువగా ఆశించకూడదు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల టైం ఇద్దాం. అప్పుడే వారి పనితీరుపై ఒక అంచనాకు రాగలం. ఈ లోగా మీడియా వారి పరిపాలనను నిరంతరం గమనిస్తూ ఉండాలి ప్రజాపక్షాన మేము కూడా పర్యవేక్షిస్తూనే ఉంటాం” అని కమల్ హాసన్ అన్నారు. అటు రజనీ ఇటు కమల్ చేసిన కామెంట్స్ ఇప్పడు చెన్నై మీడియా వర్గాలలో హాట్ టాపిక్ అయ్యాయి.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!