Kamal Haasan: లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో సరికొత్త పొత్తు పొడవబోతోంది. అధికార డీఎంకే పార్టీతో కమల్ హాసన్‌కి చెందిన ‘మక్కల్ నీది మయ్యం’ పొత్తు పెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో పొత్తుపై ప్రకటన వెలువడుతుందని సోమవారం కమల్ హాసన్ తెలిపారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజుల్లో శుభవార్తతో మిమ్మల్ని కలుస్తానని, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పనులు బాగానే జరుగుతున్నాయని, మంచి అవకాశం వస్తుందని, పొత్తుకు సంబంధించి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల ప్రచారం శరవేగంగా సాగుతోంది. ఒకవైపు అధికార బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండగా మరోవైపు కాంగ్రెస్ మాత్రం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు నానాతంటాలు పడుతోంది.