Kamal Haasan : సీనియర్ హీరో కమల్ హాసన్ చేసిన తాజా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. సినిమాల్లో యాక్షన్ సీన్లకు కూడా కొదువ ఉండట్లేదు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో ఆయన చేస్తున్న తాజా మూవీ థగ్ లైఫ్. ఈ మూవీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా నేడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్ సరసన సీనియర్ హీరోయిన్ త్రిష, అభిరామి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ చాలా ఫన్నీ కామెంట్లు చేశారు.
Read Also : Somireddy Chandramohan Reddy: కాకాణిని పట్టిస్తే బహుమతి..! సోమిరెడ్డి ఆఫర్..
‘నేను 30 ఏళ్ల క్రితం మణిరత్నంతో సినిమా చేసినప్పుడు ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సినిమాల పట్ల ఆయనకు ఉన్న కమిట్ మెంట్ కొంచెం కూడా తగ్గలేదు. అది ఆయన గొప్పతనం. సినిమాలను ఎలా తీస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో ఆయనకు బాగా తెలుసు. మేం చర్చలు జరిపినప్పుడే సినిమా పావు భాగం అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇందులో త్రిష, అభిరామి ఇద్దరూ నటించారు. కానీ ఒక్కరు కూడా నాకు ఐలవ్ యూ చెప్పలేదు (నవ్వుతూ). ఏఆర్ రెహమాన్ సంగీతం నాకు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. ఈ సాంగ్ అందరికీ నచ్చేలా ఉంది. ఈ జనరేషన్ కు తగ్గట్టు ఈ మూవీని ఆయన తీశారు’ అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.