‘లోక చాప్టర్ 1: చంద్ర’ (Lokah Chapter 1: Chandra) సినిమాతో కల్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. డామినిక్ అరుణ్ దర్శకత్వంలో, దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా, ఆగస్టు 29న రిలీజ్ అయ్యింది. రూ.30 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ఇప్పటివరకు రూ. 200 కోట్లు వసూలు చేసింది. విడుదలైన దగ్గర నుంచి విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తోంది. ఇకపోతే, ఈ చిత్రంతో “దేశంలోనే తొలి ఫీమేల్ సూపర్ హీరో”గా గుర్తింపు రావడం తనకు ఎంతో గర్వంగా ఉందని కల్యాణి ఎమోషనల్‌గా స్పందించారు.
Also Read : Bhadrakali : విజయ్ ఆంటోనీ భద్రకాళి ట్రైలర్ రిలీజ్..
కళ్యాణి మాట్లాడుతూ.. ‘ ‘లోక చాప్టర్ 1: చంద్ర’ విజయం తర్వాత అందరూ నన్ను ఫీమేల్ సూపర్ హీరో అని పిలుస్తున్నారు. ఇది నా కెరీర్‌లోనే గర్వించదగ్గ క్షణం. ఈ సినిమా సక్సెస్‌లో నా టీమ్ మొత్తం భాగస్వామ్యం ఉంది. నేను సైన్ చేసినప్పుడు ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదు. కానీ షూటింగ్ సమయంలోనే ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అర్థమైంది. ఈ పాత్రను భుజాలపై వేసుకొని మోశానని ప్రేక్షకులు చెబుతున్నారు. కానీ, మా టీమ్‌లో పురుషులు – మహిళలు అనే తేడా లేకుండా అందరూ బాగా కష్టపడ్డారు. ఈ సినిమా వల్ల హీరోయిన్స్ కూడా ఏ పాత్రలోనైనా మెరవగలరని నిరూపితమైంది” అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.