‘మార్గన్’ విజయంతో మంచి ఊపుమీదున్న హీరో విజయ్ ఆంటోనీ, ఇప్పుడు మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇందులో హీరోయిన్స్ తృప్తి రవీంద్ర, రియా జిత్తు నటిస్తుండగా,ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటివల టీజర్ కూడా రిలీజ్ అవ్వగా ‘పిల్లి కూడా ఒక రోజు పులి అవును… అబద్ధం, అహంకారం అంతం అవును’.. అంటూ ప్రారంభమైన ఈ టీజర్ ఈ సినిమాలో విజయ్ ఆంటోని ఏ పాత్రను పోషిస్తున్నాడన్నది సస్పెన్స్ కలిగిస్తుంది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ కూడా విడుదల చేశారు.
Also Read : Kaithi Remake : మాలే భాషలో రీమేక్ అవుతున్న కార్తీ ‘ఖైదీ’.. ‘బందువన్’ టీజర్
ట్రైలర్‌లో చూసుకుంటే ఇది ఓ పాలిటికల్ ఎంటర్‌టైనర్ అని స్పష్టంగా తెలుస్తోంది. కేరెక్టర్‌లు అన్నీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించాయి. ముఖ్యంగా ట్రైలర్ కట్‌లో ఎక్కడా స్టోరీ హింట్ ఇవ్వకుండా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని బాగా డిజైన్ చేశారు. ప్రస్తుత సమాజ సమస్యలపై మాట్లాడేలా కనిపిస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులను ఆలోచనలో పడేసేలా ఉండబోతోంది. మొత్తానికి, ట్రైలర్ రిలీజ్‌తో ‘భద్రకాళి’పై హైప్ మరింత పెరిగింది. టీజర్ లో ఒకసారి ఫ్యామిలీ మేన్‌లా, మరోసారి గ్యాంగ్ స్టర్‌లా అనిపిస్తున్నారు.. ఇంకో సందర్భంలో ఉన్నతాధికారి లా కనిపించి.. అసలు ఈ కిట్టు ఎవరు? అనే ఆసక్తిని రేకెత్తించేలా భద్రకాళి టీజర్‌ను కట్ చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో అంతకు మించిన డౌట్స్ క్రియేట్ చేశారు. మొత్తానికి తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచింది.