NBK108: లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, చందమామ సినిమాతో ఇండస్ట్రీలో మెరిసిపోయి, మిత్రవిందగా ఇప్పటికీ కుర్రాళ్ల గుండెల్లో తిష్టవేసుకొని కూర్చున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. సీనియర్, జూనియర్ అని లేకుండా స్టార్ హీరోలందరి సరసన నటించి మమెప్పించిన ఈ భామ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రేమించిన గౌతమ్ కిచ్లూని వివాహమాడి కుర్రకారుకు పెద్ద షాక్ ఇచ్చింది. పెళ్లి అయిన రెండో ఏడాదే ఒక బిడ్డకు జన్మనిచ్చి మరింత షాక్ ఇచ్చింది. ఇక కొడుకు పుట్టాకా కాజల్ సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇస్తుందని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కాజల్ రీఎంట్రీ పెద్ద సంచలనంగా మారింది. బరువు తగ్గి, మునుపటి రూపంతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యింది. ఇప్పటికే తమిళ్ లో ఘోస్టీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ నే పట్టేసింది.
Nandamuri Balakrishna: తారకరత్న జ్ఞాపకార్థం.. బాలయ్య ఏం చేశాడో తెలిస్తే ఫిదా అయిపోతారంతే
నటసింహం నందమూరి బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న NBK108 లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్నీ మేకర్స్ కన్ఫర్మ్ చేస్తూ కాజల్ ను తమ చిత్రంలోకి ఆహ్వానించారు. ” నందమూరి బాలకృష్ణ సరసన నటిస్తున్న కాజల్ కు స్వాగతం. నీకు ఈ సినిమా గొప్ప ప్రయాణం కాబోతోంది. వెల్కమ్ కాజల్” అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. పెళ్లి అయ్యి, బిడ్డ పుడితే.. అక్క, వదినా క్యారెక్టర్స్ తో రీ ఎంట్రీ ఇస్తారు. కానీ, మన చందమామ మాత్రం రీ ఎంట్రీ కూడా హీరోయిన్ గానే వస్తుంది. మరి ఈ సినిమాతో కాజల్ మళ్లీ పుంజుకుంటుందా..? హీరోయిన్ గా సెట్ అవుతుందా..? అనేది
తెలియాల్సి ఉంది.
Privileged to welcome @MsKajalAggarwal on board to play the leading lady opposite to our Natasimham #NandamuriBalakrishna garu in #NBK108🤗
I'm sure this is going to be a great journey 😀@sreeleela14 @MusicThaman @sahugarapati7 @harish_peddi @YoursSKrishna @Shine_Screens pic.twitter.com/L8jIKd8iVd
— Anil Ravipudi (@AnilRavipudi) March 20, 2023