Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలోనే కాదు రెండు తెలుగురాష్ట్రాలకు తెలుసు. కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే. అభిమానులపై ఎంత కోపం అయితే చూపిస్తాడో.. అంతకన్నా ఎక్కువ ప్రేమను కురిపిస్తాడు. ఒక్కసారి నా అనుకుంటే వారికోసం ఎంత అయినా చేస్తాడు. అందుకే అభిమానులకు బాలయ్య అంటే అంత అభిమానం, ప్రేమ. ఇక తారకరత్న విషయంలో బాలయ్య చేసిన సహాయం అంతా ఇంతా కాదు. తారకరత్నను హాస్పిటల్ లో చేర్చిన దగ్గరనుంచి ఆయన దశదిన కర్మ వరకు అన్ని బాలయ్యే దగ్గరుండి చూసుకున్నాడు. సొంత తండ్రి కూడా చేయని పనులను బాబాయ్ గా బాలయ్య చేశాడు. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి ఉన్న ఏకైక సపోర్ట్ బాలకృష్ణనే. ఈ విషయాన్ని ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. తారకరత్న మృతిచెంది దాదాపు నెల అవుతోంది.
Vishwak Sen: నెక్స్ట్ జనరేషన్ ఎన్టీఆర్ నువ్వే.. విశ్వక్ ఏమన్నాడంటే..?
ఇక అన్న కొడుకు కోసం బాలయ్య ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. అతని పేరు నిత్యం గుర్తుండాలి, తారకరత్న జ్ఞాపకార్థం బాలయ్య ఒక మంచి చేశాడు. అదేంటంటే.. హిందూపురంలో నిర్మిస్తున్న హాస్పిటల్ లోని ఒక బ్లాక్ కు తారకరత్న అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. బసవతారకం హాస్పిటల్ తరువాత హిందూపురంలో అంత పెద్ద హాస్పిటల్ ను నిర్మించాడు బాలయ్య. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో పోరాడేవారికి బాలయ్య సాయం చేస్తున్నాడు. అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ చికిత్స దొరుకుతుంది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు.. బాలయ్యను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అందుకే మా బాలయ్య మనసు వెన్న అంటారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.