టాలీవుడ్ చందమామ రీ ఎంట్రీ ఇవ్వనుందా..? అని అంటే అవును అనే వార్తలు గుప్పమంటున్నాయి.. ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని పెళ్ళాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించడానికి సిద్దమైన కాజల్ ‘ఆచార్య’ సినిమా చేస్తుండగానే ప్రెగ్నెన్సీ అని తెలియడంతో ఆ సినిమాతో పాటు మిగిలిన ప్రాజెక్టులను అన్నింటిని క్యాన్సిల్ చేసుకున్న విషయం విదితమే.. ఇక బిడ్డ పుట్టేవరకు కాజల్ సినిమాలు దూరంగా ఉంది. ఇటీవలే కాజల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి పేరును నీల్ కిచ్లూ గా చెప్పుకొచ్చింది. ఇక బిడ్డ పుట్టాకా కాజల్ పూర్తి కుటుంబంతో దృష్టి పెట్టాలనుకుంటోందని, అందుకే సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.
ఇక ఈ వార్తలను కాజల్ సైతం ఖండించకపోయేసరికి ఆ వార్తలు నిజమే అని అభిమానులు అనుకున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వనున్నదట.. ప్రస్తుతం తల్లి అయ్యాకా కొద్దిగా బొద్దుగా తయారయిన అమ్మడు బరువు తగ్గే ప్రయత్నాలలో ఉన్నదని సమాచారం. ఇక తన మునుపటి రూపంలోకి వచ్చిన వెంటనే ఆమె తిరిగి సినిమాలతో బిజీగా మారనున్నదని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఆమె మేనేజర్స్.. డైరెక్టర్స్ కు, నిర్మాతలకు కథలు పంపించాల్సిందిగా కోరుతున్నారట .. అంతకు ముందులా కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించాలని చూస్తున్నదట కాజల్.. ఇక ఈ వార్త వినగానే కాజల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ స్టార్ హీరో సరసన కాజల్ రీ ఎంట్రీ ఇవ్వనుందో చూడాలి.