Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal: సినీ తారల వ్యక్తిగత జీవితాలపై వచ్చే పుకార్లకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకుని అన్యోన్యంగా సంసారం సాగిస్తున్నా సరే.. ఏదో ఒక సందర్భంలో ‘విడాకులు’ అనే ముద్ర వేసి రూమర్లు సృష్టించడం నెట్టింట నిత్యకృత్యమైంది. గతంలో నయనతార – విఘ్నేష్ శివన్ దంపతులపై ఇలాంటి ప్రచారం జరిగినప్పుడు జంటగా ఫొటోలు పెట్టి బ్రేక్ వేయాల్సి వచ్చింది. అటు సూర్య – జ్యోతిక విడిపోతున్నారంటూ కథనాలు అల్లినా, ఇటీవలే 20వ వివాహ వార్షికోత్సవాన్ని స్కాట్లాండ్లో ఘనంగా జరుపుకుని ఆ పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టారు. తాజాగా ఈ విభేదాల సెగ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌కి కూడా తాకింది. గౌతమ్ కిచ్లును ప్రేమ వివాహం చేసుకుని, ఓ బాబుకు జన్మనిచ్చిన కాజల్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. అయితే కొద్ది రోజులుగా ఓ స్టార్ హీరోయిన్ వైవాహిక బంధం ముగింపు దశకు చేరిందంటూ, అందులో కాజల్ పేరే ఉందంటూ పలు వెబ్సైట్లు, సోషల్ మీడియా వేదికల్లో జోరుగా కథనాలు వెలిశాయి. ఈ ప్రచారంపై కాజల్ నేరుగా రచ్చ చేయకుండా, తనదైన శైలిలో పరోక్షంగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమాజంలో మారుతున్న బంధాలు, పెరుగుతున్న విడాకుల సంస్కృతిపై కాజల్ మాట్లాడింది. నేటి తరంలో బంధాలు బీటలు వారడానికి సోషల్ మీడియా ప్రభావమే ప్రధాన కారణమని ఆమె స్పష్టం చేసింది. చాలా మంది డిన్నర్‌కు వెళ్లినా ఎదురెదురుగా కూర్చుని ఫోన్లలోనే మునిగిపోతున్నారని, కానీ తమ ఇంట్లో అలాంటి పరిస్థితులకు తావులేదని వెల్లడించింది. “నేనూ నా భర్త ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోన్లను పూర్తిగా పక్కన పెట్టేస్తాం. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటాం, ఒకరి సమయాన్ని మరొకరం గౌరవిస్తాం. స్క్రీన్లకు బానిసలు కాకుండా భాగస్వామితో నాణ్యమైన సమయం గడపడం అలవాటు చేసుకుంటే ఏ బంధమైనా నిలుస్తుంది” అంటూ తమ దాంపత్యం ఎంత పటిష్టంగా ఉందో వివరించింది. ఈ వ్యాఖ్యల ద్వారా తమ మధ్య ఎలాంటి కలతలు లేవని, విడాకుల వార్తలన్నీ నిరాధారమైనవని పరోక్షంగా తేల్చిచెప్పింది. కెరీర్ విషయానికొస్తే.. ‘భగవంత్ కేసరి’ బ్లాక్‌బస్టర్ తర్వాత మరోసారి నందమూరి బాలకృష్ణ సరసన దాదా చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని చెప్పడంతో అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌ను సమతుల్యంగా నడిపిస్తూ పుకార్ల రాయుళ్లకు కాజల్ గట్టిగానే సమాధానమిచ్చింది.
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
- Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!