Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువతకు టైమ్ వాల్యూ (సమయం విలువ) గురించి వివరిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అమెరికా ప్రెసిడెంట్ కైనా, ఒక సాదాసీదా రైతుకైనా రోజుకు 24 గంటలే. ఆ సమయాన్ని ఎలా వాడుకున్నామన్నదే మనల్ని విజేతలుగా నిలబెడుతుంది. టైమ్ ఈజ్ మనీ.. ఒక్కసారి గడిచిపోతే ఆ నిమిషాలు తిరిగి రావు” అంటూ యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే తన డెడికేషన్ గురించి మాట్లాడుతూ.. తన డైలీ రొటీన్ ను బట్టబయలు చేశారు. ఉదయం 8 గంటలకు కోకాపేటలో షూటింగ్ ఉంటే, ఉదయం 4:30 కే నిద్రలేచి ఎక్సర్సైజ్ పూర్తి చేసుకుని, మేకప్ వేసుకుని కచ్చితంగా ఆ సమయానికి సెట్స్ లో ఉంటానని చెప్పారు. ఇంత స్థాయికి వచ్చాక తాను ఎప్పుడో 11 గంటలకు సెట్స్ కు వెళ్లినా తనను అడిగేవారు లేరని, కానీ తాను ఆ పని చేయనని స్పష్టం చేశారు. ఒక మెయిన్ లీడ్ యాక్టర్ క్రమశిక్షణగా ఉంటేనే హోల్ యూనిట్ అలర్ట్ గా ఉంటుందని, ఉదయం 7 గంటలకే ఫుల్ యూనిట్ రెడీగా ఉండేలా తాను వాతావరణం సృష్టిస్తానని చెప్పారు. యువత కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా భవిష్యత్తు కోసం ఒక రోడ్ మ్యాప్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) వేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.
జీవితంలో పైకి ఎదగాలి అనుకున్నప్పుడు ఎన్నో అవమానాలు, నిరాశలు ఎదురవుతుంటాయి. వాటిని ఎలా జయించాలో మెగాస్టార్ చిరంజీవి ఒక అద్భుతమైన ఫిజిక్స్ ఎగ్జాంపుల్ తో వివరించారు. ఒక ఖాళీ జార్ (మనస్సు) తీసుకుని, అందులో ముందు ఇసుక (అవమానాలు, డిసపాయింట్మెంట్స్) నింపేస్తే, అసలైన రాళ్లకు (మన గోల్స్ కి) చోటు ఉండదని ఆయన చెప్పారు. ముందుగా మన లక్ష్యాలు (రాళ్లు) తో ఆ జార్ ను నింపేస్తే.. ఆ తర్వాత అవమానాలు, విమర్శలు (ఇసుక) అందులో వేసినా, ఎక్కడో ఒకచోట ఆ ఇసుక రేణువులు సర్దుకుపోయి కనుమరుగైపోతాయని అద్భుతమైన లాజిక్ చెప్పారు. అలా కాకుండా ముందే నిరాశ నిస్పృహలకు చోటిస్తే అసలైన లక్ష్యాలు డైల్యూట్ (Dilute) అయిపోతాయని, మన ప్రయాణం స్లో డౌన్ అవుతుందని ఆయన హెచ్చరించారు. అందరికీ జీవితం కేక్ వాక్ (Cake walk) లా ఉండదని, మన మైండ్ సెట్ మార్చుకుంటే చిన్న చిన్న నెగిటివిటీలను ఈజీగా పక్కనపెట్టొచ్చని ఆయన తెలిపారు. మన తల్లిదండ్రుల కోరికలు తీర్చడం, సమాజం మనల్ని చూసి గర్వపడేలా ఎదగడం లాంటివి మన గోల్స్ (రాళ్లు) కావాలని చిరంజీవి పిలుపునిచ్చారు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజావార్తలు
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!