‘ఖైదీ 2’ గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసిన తాజా కామెంట్స్‌తో ఫ్యాన్స్ ఆశల పరాకాష్టకు చేరిపోయారు. ‘విక్రమ్’, ‘లియో’ వంటి చిత్రాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి బలం చేకూర్చినా, ఈ యూనివర్స్‌కు అసలు బీజం వేసింది మాత్రం ‘ఖైదీ’ అనే చెప్పాలి. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందనగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఉత్సాహం నెలకొంది. ఢిల్లీ పాత్ర మళ్లీ తెరపై ఎలా కనిపించబోతుందో, ఈసారి అతని ప్రయాణం ఎటు దారి తీస్తుందో అన్నదానిపై భారీ క్యూరియాసిటీ నెలకొంది. దీంతో పాటు ఈ సినిమాలో మరో స్టార్ కాస్టింగ్ ఉంటుందా? లియో లేదా విక్రమ్ నుంచి ఎవైనా పాత్రలు కనెక్ట్ అవుతాయా? అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. అయినప్పటికి ఇప్పటివరకు మాత్రం ‘ఖైదీ 2’ ఎప్పుడు వస్తుందా అనే ప్రశ్నకు స్పష్టత లేదు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ ఇచ్చిన కామెంట్స్ మాత్రం ఖైదీ ఫ్యాన్స్‌కి పెద్ద గిఫ్ట్‌గా మారాయి.
Also Read : Kishkindhapuri : ‘కిష్కింధపురి’ నుండి సాలిడ్ అప్డేట్.!
‘ ‘ఖైదీ 2’ స్క్రిప్ట్ ఇప్పటికే రాయడం పూర్తయ్యింది. దాదాపు 30 నుంచి 35 పేజీల స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే రిపార్ట్ రెడీ. స్టోరీ చాలా బాగా వచ్చింది, నేనే ఎగ్జైటెడ్‌గా ఉన్న! ప్రస్తుతం ‘కూలీ’ పూర్తి చేసిన తర్వాతే ‘ఖైదీ 2’ లోకి ఎంటర్ అవుతాను. ఈసారి ఖైదీ రిటర్న్ మరింత మాస్, మరింత ఎమోషనల్ గా ఉండబోతోంది’ అని స్పష్టంగా తెలిపాడు లోకేష్. దీంతో మొదటి పార్ట్‌లో హీరో డిల్లీ పాత్ర నిశ్శబ్దంగా, బేస్ మ్యూజిక్‌తో ఎమోషనల్ యాక్షన్‌కు ఒక బెంచ్‌మార్క్ సెట్ చేసినా. ఇప్పుడు ‘ఖైదీ 2’లో ఆ పాత్ర మళ్లీ ఎలా మలుపుతీసుకుంటుందో అన్న దానిపై భారీ క్యూరియాసిటీ ఉంది. లోకేష్ స్టైల్ ప్రకారం.. యాక్షన్, డ్రామా, ఎమోషన్ మళ్ళీ ఓ మాస్ ప్యాకేజ్‌గా సెట్ చేయడం ఖాయం.