దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. అయితే ఇటీవల రజనీకాంత్ హీరోగా లోకేష్ చేసిన ‘కూలీ’ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ క్రమంలోనే, తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఒక సినిమా చేయడానికి ప్రయత్నించగా అది వర్కౌట్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఆయన ‘ఖైదీ 2’ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.…
‘ఖైదీ 2’ గురించి దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసిన తాజా కామెంట్స్‌తో ఫ్యాన్స్ ఆశల పరాకాష్టకు చేరిపోయారు. ‘విక్రమ్’, ‘లియో’ వంటి చిత్రాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌కి బలం చేకూర్చినా, ఈ యూనివర్స్‌కు అసలు బీజం వేసింది మాత్రం ‘ఖైదీ’ అనే చెప్పాలి. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందనగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఉత్సాహం నెలకొంది. ఢిల్లీ పాత్ర మళ్లీ తెరపై ఎలా కనిపించబోతుందో, ఈసారి అతని ప్రయాణం ఎటు దారి తీస్తుందో అన్నదానిపై భారీ క్యూరియాసిటీ…