Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ నటి జ్యోతి రాయ్. ఈ ఒక్క పాత్రతోనే ఆమె కన్నడలో సంపాదించుకోలేని పేరును దక్కించుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి- వసుధార ఎంత ఫేమస్ అయ్యారో.. జగతి పాత్ర కూడా అంతే ఫేమస్ అయ్యింది. ఇక కొన్నిరోజుల క్రితమే ఆమె ఒక డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ మొదలుపెట్టింది. గత కొన్ని రోజుల నుంచి జ్యోతి రాయ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తుంది. ఇక ప్రస్తుతం జ్యోతి.. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ప్రెట్టి గర్ల్ అనే వెబ్ సిరీస్ ఒకటి చేస్తుండగా.. నో మోర్ సీక్రెట్స్ అనే సినిమాలో మెయిన్ లీడ్ గా చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.
Janhvi Kapoor: పదహారణాల పల్లెటూరి పిల్ల.. మా ‘దేవర’ గర్ల్ ఫ్రెండ్
ఇకపోతే నిత్యం సోషల్ మీడియాను షేక్ చేసే జ్యోతి రాయ్.. తాజాగా మరో హాట్ పిక్ ను షేర్ చేసింది. రెడ్ అండ్ రెడ్ షార్ట్స్ లో నడుము చూపిస్తూ అదరగొట్టింది. నడిరోడ్డుపై అమ్మడు అందాల ఆరబోసిన ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు సూపర్ ఆంటీ అని కొందరు అంటుండగా.. ఇంకొందరు మాత్రం.. నువ్వు చేసే పాత్రలకు.. నువ్వు చూపిస్తున్న లుక్ కు ఏమైనా సంబంధం ఉందా.. ? అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాలతో జగతి ఆంటీ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.