బాలకృష్ణ విడుదల చేసిన ‘జెట్టి’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న చిత్రం ‘జెట్టి’. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ‘నా ఆశ కంటే మా నాన్న ఆశయం ముఖ్యం’ అనే హీరోయిన్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఊరికి జెట్టిని తీసుకురావాలనే తండ్రి ఆశయం కోసం కూతురు రాజీలేని పోరాటం చేస్తుంది. జెట్టి వల్ల పర్యాటకం పెరిగి ఊరు బాగుపడుతుందన్నది ఆయన ఉద్దేశం.
Read Also : కెమెరాకు కలిసి ఫోజిచ్చిన భీమ్లా నాయక్, డేనియల్ శేఖర్… పిక్ వైరల్
Also Read
అయితే జనం బాగుపడటం ఇష్టంలేని విలన్లు జెట్టి కాదు కదా మట్టిని కూడా తీసుకురానివ్వమని అడ్డుపడుతుంటారు. హీరో సహాయంతో ప్రతినాయకుల స్వార్థాన్ని జయించి ఊరికి జెట్టిని తీసుకొచ్చిందా? లేదా? అన్నది చిత్ర కథాంశం. మత్స్యకారుల జీవనం, స్థితిగతులు, వారి జీవనంలో భావోద్వేగాలను ఆవిష్కరించినట్లు ట్రైలర్ తెలియచేస్తోంది. బాలకృష్ణ ట్రైలర్ చూసి బాగుందని ప్రశంసించడం ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని ఆయనకు యూనిట్ తరుపున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు నిర్మాత. త్వరలో థియేటర్ లలో సినిమాను విడుదల చేస్తామంటున్నారు.



తాజావార్తలు
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
-
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!