‘సూపర్’ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటి అనుష్క. తొలుత గ్లామర్ రోల్స్ చేసి అలరించిన ఈ ముద్దుగుమ్మ బిల్లా, విక్రమార్కుడు, అరుంధతి మూవీలో నుంచి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో జతకట్టిన ఆమె అటు తమిళంలో కూడా రాణించింది. అనుష్క కెరీర్ లో బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు మైలురాయిగా నిలిచిపోయాయి. దేవసేన పాత్రలో యువరాణిగా, వృద్దురాలిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి మెస్మరైజ్ చేసింది. బాహుబలి సక్సెస్ లో అనుష్కకు కూడా భాగం ఉంది. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పుడు ‘ఘాటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read:Rakul: ఇలాంటి రూమర్స్ పుట్టించకండి ప్లీజ్!!
క్రిష్ దర్శకత్వంలో ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో జరిగిన ఓయధార్ధ సంఘటనాదారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అనుష్క బాధితురాలి నుంచి నేరస్తురాలిగా మారిన పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇక ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కాగా .. చాలా వరకు ముఖ్యమైన సీన్స్ కంప్లీట్ చేసుకుంది. ఏప్రిల్ 18న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఏంటి అంటే ఈ సినిమాలో ఆంధ్రా-ఒడిశా బోర్టర్ అటవీ ప్రాంతంలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయట.
అయితే అటవీ నేపథ్యంలో సాగే యాక్షన్ , ఛేజింగ్ సన్నివేశాల విషయంలో అపుష్క ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నటించిందిట. రియల్ లొకేషన్స్‌లో రియల్ స్టంట్స్ తో అదర గొట్టిందట.. అంతేకాదు ఆయా సన్నివేశాల్లో ఎలాంటి డూప్ లేకుండా తానే స్వయంగా నటించిందట. ఈ సన్నివేశాలకోరకు అనుష్క ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుందట. మరికొన్ని సన్నివేశాలు మావోయిస్టుల అడ్డా ప్రాంతమైన దంతెవాడ అటవీ ప్రాంతంలో కొన్నికీలకసన్నివేశాలు చిత్రీకరించారట. అలాంటి చోట షూటింగ్ అంటే ? చిన్న విషయం కాదు. కత్తి మీద సాములాంటి వ్యవహారమే. అయినా చిత్రీకరణ విషయంలో క్రిష్ – అనుష్క ఎక్కడా బయపడకుండా రిస్క్ లొకేషన్లలో సైతం షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా నిర్మాణానంతర పనుల్లో ఉంది. మొత్తానికి అనుష్క లాంగ్ గ్యాప్ తర్వాత గట్టిగా ప్లాన్ చేస్తుంది.