‘సూపర్’ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటి అనుష్క. తొలుత గ్లామర్ రోల్స్ చేసి అలరించిన ఈ ముద్దుగుమ్మ బిల్లా, విక్రమార్కుడు, అరుంధతి మూవీలో నుంచి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో జతకట్టిన ఆమె అటు తమిళంలో కూడా రాణించింది. అనుష్క కెరీర్ లో బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు మైలురాయిగా నిలిచిపోయాయి. దేవసేన పాత్రలో యువరాణిగా, వృద్దురాలిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి మెస్మరైజ్ చేసింది. బాహుబలి సక్సెస్…