Site icon NTV Telugu

Jaanhvi Kapoor : పురుష అహంకారం.. హీరోలపై జాన్వీకపూర్ సంచలన కామెంట్స్

Janhvi

Janhvi

Jaanhvi Kapoor : హీరోయిన్ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే కదా. వివాదాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ తాజాగా కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. అది కూడా హీరోల మీద. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ జంటగా నిర్వహిస్తున్న టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ షోకు తాజాగా జాన్వీకపూర్, కరణ్‌ జోహార్ గెస్టులుగా వచ్చారు. ఇందులో జాన్వీకపూర్ ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం గురించి సంచలన కామెంట్లు చేసింది.

Read Also : Bigg Boss 9 : అయ్యో.. పచ్చళ్ల పాప ఎలిమినేట్..?

‘ఇండస్ట్రీలో పురుష అహంకారమే ఎక్కువగా ఉంది. వారి అహంకారాన్ని తట్టుకుని నిలబడాలంటే చాలా సార్లు మౌనంగా అన్నీ భరించాల్సి వస్తోంది. ఇష్టం లేకపోయినా కొన్ని బయటకు చెప్పలేకపోతున్నాం. హీరోల కోసం తక్కువగా నటించాల్సి వస్తోంది. ఈ విషయంలో నేను ఎన్నో సార్లు పోరాడుతున్నాను. హీరోల కోసం హీరోయిన్లను కావాలనే తక్కువగా చేసి చూపిస్తున్నారు’ అంటూ తెలిపింది జాన్వీకపూర్. దీంతో ఆమె చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టైమ్ లో ఇలాంటి కామెంట్లు ఆమె కెరీర్ ను దెబ్బ తీస్తాయా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Read Also : Rana : తండ్రి కాబోతున్న హీరో రానా..?

Exit mobile version