Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వరుసగా టాలీవుడ్ ప్రాజెక్టుల్లో భాగమవుతూ సౌత్ ఆడియెన్స్‌కు దగ్గరవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాలో నటించిన జాన్వీ, ప్రస్తుతం రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబోలో వస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీని తర్వాత మరో తెలుగు సినిమాలోనూ ఆమె నటిస్తుందనే టాక్ నడుస్తోంది. జాన్వీ కపూర్ ఓల్డ్ ఇంటర్వ్యూ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : SSMB 29 : సమయం ఆసన్నమైంది.. ఫ్యాన్స్ కు మహేశ్ బాబు స్పెషల్ వీడియో
కాఫీ విత్ కరణ్ షోలో ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది. ఆ షోలో హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన “సౌత్ హీరోల్లో ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటావు?” అనే ప్రశ్నకు జాన్వీ వెంటనే “విజయ్ దేవరకొండ” అని సమాధానమిచ్చింది. ఆ సమాధానం అప్పట్లో బోలెడన్ని రూమర్లు సృష్టించగా, ఇప్పుడు ఆమె వరుస తెలుగు సినిమాలు చేస్తుండటంతో ఆ కామెంట్ మళ్లీ హాట్ టాపిక్ అయింది. జాన్వీ తెలుగులో మరికొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లలో కూడా కనిపించబోతోందని టాలీవుడ్ టాక్.
Read Also : Bigg Boss 9 : సుమన్ శెట్టికే జై కొడుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. కప్ కొట్టేస్తాడా..?