SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ఇండియా ప్రాజెక్ట్ ఎస్‌ఎస్‌ఎంబీ29 చుట్టూ రోజురోజుకు హైప్ పెరుగుతోంది. ఈ మూవీ టైటిల్, కాన్సెప్ట్ ఈవెంట్‌ను నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో అద్భుతంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. రాజమౌళి టీమ్ భారీ సెట్స్ వేస్తూ, ప్రపంచ స్థాయి ప్రెజెంటేషన్‌కు సన్నాహాలు చేస్తోంది. దీనిపై తాజాగా మహేశ్ బాబు స్పెషల్ వీడియో పంచుకున్నాడు. ఇన్ని నెలలుగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు 15న సమాధానం ఇస్తానన్నాడు.
Read Also : Bigg Boss 9 : సుమన్ శెట్టికే జై కొడుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. కప్ కొట్టేస్తాడా..?
మహేశ్ బాబు తన సోషల్ మీడియా ద్వారా ఈ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. మా అనుభవాలను ఆరోజు మీతో పంచుకుంటాం. ఈ ప్రపంచం ఆ రోజు మా కథలోకి వచ్చేస్తుంది అని చెప్పాడు. ఈ వీడియో చూసి ఫ్యాన్స్ ఉత్సాహంతో మునిగిపోయారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈవెంట్‌లో టైటిల్ రివీల్‌తో పాటు, మూవీ కాన్సెప్ట్ గ్లింప్స్ చూపించనున్నారని టాక్. రాజమౌళి ఎలాంటి మ్యాజిక్ అందిస్తాడో చూడాలి.
Read Also : Rajinikanth : రజినీకాంత్ అన్నయ్యకు హార్ట్ ఎటాక్..