Janhvi Kapoor : అందాల భామ జాన్వీకపూర్ కు బాలీవుడ్ నుంచి వరుస షాకులు తగిలాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మూడు సినిమాలు రిలీజ్ అయితే.. అందులో ఒక్కటి కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. పరమ్ సుందరి, సన్నీ సంస్కారి కి తుల్సీ కుమారి సినిమాలకు మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. అవి బాక్సాఫీస్ దగ్గర నిలబడలేక ఫెయిల్యూర్లుగా నిలిచాయి. హోం బౌండ్‌కు ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్ గా హిట్ కాలేదు. మరీ దారుణం ఏంటంటే ఈ భామకు బాలీవుడ్ అస్సలు కలిసి రావట్లేదు. అక్కడ ఎన్ని సినిమాలు చేస్తున్నా సరే మినిమం హిట్ కూడా పడట్లేదు. దీంతో ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీనే దిక్కు అని అనుకుంటోంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన దేవర మంచి హిట్ అయింది. ఆ సినిమా జాన్వీకపూర్ కు బూస్ట్ ఇచ్చింది. ఆ సినిమా వల్లే ఆమె రామ్ చరణ్ పెద్దిలో ఛాన్స్ దక్కించుకుంది. పెద్ది షూటింగ్ ప్రస్తుతం స్పీడ్ గా జరుగుతోంది.
Read Also : Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ.. ప్రశాంత్ నీల్ ఇలా చేశావేంటి..?
ఆ వెంటనే దేవర-2 కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో జాన్వీ ఇప్పుడు తన ఆశలన్నీ పెద్ది, దేవర-2 మీదనే పెట్టుకుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే తన కెరీర్ మళ్లీ గాడిన పడుతుందని భావిస్తోంది. ఈ సినిమాలతో తనకు బాలీవుడ్ లో ఛాన్సులు రాకపోయినా.. సౌత్ లో మంచి ఆఫర్లు వస్తాయని.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో పాగా వేయొచ్చని భావిస్తోంది. ఎలాగూ తన తల్లి శ్రీదేవి అభిమానులు తనకు సపోర్ట్ చేయకపోతారా అని ఆశిస్తోంది. ఇలా రెండూ కలిసొస్తాయి అనుకుంటుంది ఈ గ్లామర్ డాల్. పెద్ది సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దేవర ఎలాగూ హిట్ గ్యారెంటీ మూవీ. మరి ఈ బ్యూటీ పెట్టుకున్న ఆశలు నిలబడుతాయా లేదా చూడాలి.
Read Also : Chiranjeevi : చిరంజీవి ఆ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాడు..?