Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. అయితే మొన్న దీపావళి పండుగ సందర్భంగా చిరంజీవి ఓ ట్వీట్ చేశాడు. అందులో నాగార్జున, వెంకటేశ్ లను తన ఇంటికి పిలిచి దీపావళి గిఫ్ట్ లను ఇచ్చాడు. అలాగే నయనతార్ పిక్ పంచుకున్నాడు. కేవలం వీళ్ల ఫొటోలను మాత్రమే షేర్ చేశాడు. వాళ్లతో కలిసి దీపావళి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నాడు. కానీ ఓ ఇంపార్టెంట్ విషయాన్ని చిరంజీవి దాచిపెట్టారు. అదే ఉపాసన సీమంతం. విషయం ఏంటంటే ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయింది. దీపావళి రోజున ఆమెకు ఘనంగా సీమంతం కూడా జరిపించారు.
Read Also : Shriya Saran : శ్రియ పిచ్చెక్కించే అందాలు.. చూస్తే అంతే
ఈ సీమంతం వేడుకకు నాగ్, వెంకీలు మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. అలాగే ఉపాసన కుటుంబం కూడా సందడి చేసింది. ఇంత పెద్ద విషయాన్ని చిరు ఎందుకు పంచుకోలేదో ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు ఉపాసన ఆ విషయాన్ని షేర్ చేసింది. తన సీమంతం వీడియోను పంచుకుంది. అందులో అందరూ ఉన్నారు. వాస్తవానికి ఉపాసన ఫస్ట్ టైమ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు అందరికంటే ముందే చిరంజీవి ఆ విషయాన్ని ప్రకటించారు. కానీ రెండో ప్రెగ్నెన్సీ విషయంలో చిరంజీవి ఎందుకు సైలెంట్ అయ్యారనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఏదేమైనా మెగా ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఈ సారి చిరుకు మనవడు రావాలని అంతా కోరుకుంటున్నారు.
Read Also : Samantha : “నా లైఫ్‌లో ఉన్న ఆ వ్యక్తి గురించి ఇప్పుడేం చెప్పలేను.. కానీ సమయం వచ్చినప్పుడు చెబుతాను”