అప్డేట్, అప్డేట్ అని సోషల్ మీడియాలో రచ్చ చేసే అభిమానులకి అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో “ఏదైనా అప్డేట్ ఉంటే ఇంట్లో ఉండే భార్య కన్నా ముందు మీకే చెప్తాం… ఇలా అప్డేట్ అప్డేట్ అని నిర్మాతలని-దర్శకులని ఇబ్బంది పెట్టకండి” అంటూ ఎన్టీఆర్ గట్టి క్లాస్ పీకాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలి అని అడగడం తగ్గించారు. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అని ఎన్టీఆర్ అఫీషియల్ గా చెప్పడంతో, నందమూరి అభిమానులు ఫిబ్రవరి నెలలో ‘ఎన్టీఆర్ 30’ లాంచ్ అవుతుంది అనే జోష్ లో ఉన్నారు. ఆ జోష్ ని మరింత పెంచుతూ మరో ఇంటరెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ టాక్ ప్రకారం ఫిబ్రవరి 24న ఎన్టీఆర్ 30 మూవీ అఫీషియల్ గా గ్రాండ్ లాంచ్ అవుతుందట. అన్నపూర్ణ స్టూడియోలో ఫిబ్రవరి 24న ‘ఎన్టీఆర్ 30’ ముహూర్తం అనే వార్త సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయ్యింది.
ఎన్టీఆర్ 30 లాంచ్ డేట్ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ పక్కన నటించే హీరోయిన్ ఎవరు అనే క్లారిటీ కూడా దాదాపు వచ్చేసినట్లుగానే ఉంది. ఎన్టీఆర్ 30 సినిమా కోసం ముందు నుంచీ బాలీవుడ్ హీరోయిన్ కోసం ట్రై చేస్తున్న కొరటాల శివ, చివరికి ఎన్ని ఆప్షన్స్ వచ్చినా వదిలేసి బాలీవుడ్ హీరోయిన్ నే ఫైనల్ చేసినట్లు ఉన్నాడు. బాలీవుడ్ యంగ్ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ని కొరటాల ఫైనల్ చేసాడట. ఇటివలే శంషాబాద్ స్టూడియోలో జాన్వీ కపూర్ తో కొరటాల శివ ఫోటోషూట్ కూడా చేసాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఫిబ్రవరి 24న ఎన్టీఆర్ 30 సినిమాలో జాన్వీ నటిస్తుంది అనే విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ పాన్ ఇండియా సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ సైఫ్ అలీ ఖాన్ కి ఫిక్స్ చేశారని అంతా అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో కొరటాల శివనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.