NTR 30: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి అప్పుడే ఏడాదికి దగ్గరవుతోంది. ఇంకా ఎన్టీఆర్ 30 మాత్రం మొదలవ్వలేదు. కథలో మార్పులు అని కొన్ని రోజులు, ఎన్టీఆర్ మేకోవర్ అని మరికొన్ని రోజులు ఆలస్యం చేస్తూ వచ్చారు. ఇక కొత్త ఏడాదిలో మాత్రం ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపి అభిమానులకు చల్లని వార్తను అందించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుంది. కాగా, సినిమా క్యాస్టింగ్ పనుల్లో మేకర్స్ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి వారసురాలు జాన్వీ కపూర్ నటిస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.
మేకర్స్ ఆమెతో చర్చించడం, ఆమె ఓకే కూడా అనడం జరిగిపోయాయట. ఒక మంచి రోజు చూసుకొని ఆమె పేరును అధికారికంగా రివీల్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఈ సినిమా కోసం జాన్వీ గట్తిగానే పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జాన్వీ మొదటి తెలుగు సినిమా, అందులోనూ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా అంటే మాటలు కాదు. అయినా అమ్మడు రెమ్యూనిరేషన్ లో మాత్రం ఎక్కడా మొహమాటమే లేదని చెప్పిందట. మొదటి సినిమా హీరోయిన్ గా కాకుండా స్టార్ హీరోయిన్ లా కోటికి పైనే డిమాండ్ చేసిందని టాక్. ఇక జాన్వీ కోసం మేకర్స్ ఆమె చెప్పినంత ఇవ్వడానికి సిద్దపడ్డారట. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.