Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వస్తున్న చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో తమన్నా, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా జైలర్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించి షాక్ ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 10 న జైలర్ వస్తున్నాడు అంటూ ఓకే వీడియోతో చెప్పుకొచ్చారు. ఇక ఆ వీడియో చూస్తే అభిమానులకు దిమ్మ తిరిగిపోవడం ఖాయమనే చెప్పాలి. ఎందుకు.. ఆ వీడియోలో ఏముంది అంటే.. సినిమా మొత్తం స్టార్ క్యాస్టింగే ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు. అన్ని ఇండస్ట్రీలలో ఉన్న స్టార్ నటులను తీసుకొచ్చి జైలర్ లో నింపేశాడు నెల్సన్. రజినీని పక్కన పెడితే.. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, టాలీవుడ్ నటులు సునీల్, నాగబాబు.. హీరోయిన్ రమ్యకృష్ణ, తమన్నా.. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా మొత్తం స్టార్లే ఉన్నారని చెప్పాలి.
Khushi: ‘నా రోజా.. నువ్వే’ అంటూ సామ్ వెనుక పడుతున్న విజయ్
సాధారణంగా చిన్న పాత్రలకు కూడా బాగా పేరు ఉన్న నటులను తీసుకోవడం వలన రేంజ్ పెరుగుతుంది. పాన్ ఇండియా సినిమా వర్క్ అవుట్ అవుతుందని చెప్పుకొస్తారు. అయితే వారికి తగ్గట్టు పాత్రలు డిజైన్ చేయకపోతే అది పూర్తిగా డ్రా బ్యాక్ అవుతుంది. అయినా కథ బావుంటే.. రజినీ స్టార్ ఇమేజ్ కు ఆయన ఒక్కడు ఉంటే సరిపోతుంది. ఇంతమంది స్టార్లు అవసరమా..? నెల్సన్ భయ్యా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అంటే.. బీస్ట్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్నాకా.. రజినీతో సినిమా అనేసరికి అభిమానులు వద్దు వద్దు అని ట్రోల్ చేయడంతో .. కసిగా నెల్సన్ ఈ సినిమాను తీస్తున్నాడని టాక్. అందుకే.. ఎవ్వరిని నొప్పించకుండా ఉండడానికి రజనీ రేంజ్ లోనే స్టార్ క్యాస్టింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. హా,క్యాస్టింగ్ ఏముంది.. హిట్ అయితే అదే పదివేలు అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.