జైలర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ వింటేజ్ వైబ్స్ ఇస్తూ కనిపించి ఉంటాడు. అనిరుధ్ ఈ జనరేషన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లా వినిపించి ఉంటాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ జైలర్ సినిమాని అన్ని సెంటర్స్ లో వసూళ్ల వర్షం రాబట్టేలా చేస్తుంది. ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా జైలర్ పేరు మారుమోగుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం జైలర్ సినిమా నుంచి రజినీకాంత్, అనిరుధ్ పేర్లు కాకుండా ఇంకో పేరు వినిపిస్తోంది. అది మరెవరో కాదు కోడలి పాత్రలో నటించిన ‘మిర్నా’. వసంత్ రవి భార్య క్యారెక్టర్ లో, రజిని-రమ్యకృష్ణల కోడలుగా మిర్నా నటించింది. జైలర్ సినిమా నుంచి బయటకి వచ్చిన యూత్, ఈ అమ్మాయి ఎవర్రా ఇంత బాగుంది అంటూ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. తీరా మిర్నా ఫోటోలు చూస్తే సినిమాలో సాఫ్ట్ గా ఉంది బయటేమో ఇంత హాట్ గా ఉందేంట్రా అంటూ ఫొటోస్ ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు.
యూత్ సెర్చ్ చేయడం ఎక్కువ అవ్వడంతో మిర్నా మీనన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా మరోసారి మిర్నా మ్యాజిక్ ని చూపిస్తూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అవుతూ ఉంది. పింక్ సారీలో మిర్నా, చీరని అడ్జట్ చేసుకుంటూ ఉండగా ఎవరో వీడేమో తీశారు. ఈ సమయంలో మిర్నా కెమెరా వైపు చూసి కన్ను కొట్టింది, అంతే యూత్ అంతా ఆ వింక్ కి పడిపోయారు. ఈ చిన్న వీడియోని నాలుగున్నర లక్షల మంది చూసారు, దాదాపు వెయ్యి మంది బుక్ మార్క్ చేసుకున్నారు అంటే మిర్నా కన్ను కొట్టిన వీడియో ఎంత వైరల్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి చేసింది చిన్న క్యారెక్టర్ అయినా జైలర్ సినిమా మిర్నాకి చాలా బాగా హెల్ప్ అయ్యింది. మరి ఈ క్రేజ్ మిర్నా ఫిల్మ్ కెరీర్ కి ఎంత ఉపయోగ పడుతుంది అనేది చూడాలి.
Mirnaa Menon😉 pic.twitter.com/YFlMNwjTXS
— Manobala Vijayabalan (@ManobalaV) August 29, 2023