సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాక్. బేబీ బ్యూటీ తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య హీరోగా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమాకావడంతో జాక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కాస్త ఆసక్తిని పెంచింది. కాగా నేడు జాక్ థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన జాక్ టాక్ ఎలా ఉందంటే..
Also Read : Ajith : గుడ్ బ్యాడ్ అగ్లీ ఓవర్సీస్ రివ్యూ..
స్పై యాక్షన్ కామెడీ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు ఎందుకనో అనుకున్నంత బజ్ అయితే లేదు. అందుకు తగ్గట్టే ఇప్పుడు ఓవర్సీస్ నుండి వస్తున్న టాక్ కూడా అలానే ఉంది. ఫస్ట్ హాఫ్ చూస్తే స్క్రీన్ ప్లే గజిబిజి గందరగోళంగా ఉంది, కేవలం సిద్ధు క్యారెక్టరైజేషన్ మాత్రమే బాగా రాసుకని దాన్ని టిల్లు షేడ్స్ లో మలిచిన దర్శకుడు ఆ రేంజ్ కామెడీని పండించలేకపోయాడు. దర్శకుడు భాస్కర్ ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలను అందించడానికి ప్రయత్నించాడు కానీ గజిబిజిగా స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుడిని గందరగోళం చేసేసాడు. స్పై పార్ట్ మరియు టెర్రరిస్ట్ విలన్ సీన్స్ సహనానికి పరీక్ష పెట్టింది. వైష్ణవి చైతన్య ఒకే కానీ చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర. సిద్ధు తన ఈజ్ తో చేసుకుంటూ వెళ్ళాడు. కానీ వీక్ నేరేషన్, రైటింగ్ ఇబ్బంది పెట్టాయి. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేసిన ఈ సినిమా సంగీతం బాగోలేదు. నిర్మాణ విలువలు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా సీన్స్ లో గ్రీన్ స్క్రీన్స్ క్లియర్ గా కనిపిస్తాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో జాక్ ఎలాంటి టాక్ రాబడతాడో చూద్దాం..