కోలీవుడ్ సెన్సేషన్ స్టార్ అజిత్ కుమార్‌నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతోంది మైత్రీ మూవీస్. నేడు అనగా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. అజిత్ కుమార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ ఓవర్సీస్ లోప్రీమియర్స్ తో విడుదల కాగా అక్కడి టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం రండి..
ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పటి నుండి మరోసారి వింటేజ్ అజిత్ కుమార్ ను తెరమీద చూడబోతున్నాం అని చెప్పకనే చెప్పాడు దర్శకుడు ఆదిక్. అందుకు తగ్గట్టుగానే అజిత్ క్యారక్టర్ ను డిజైన్ చేసాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ మొత్తం అజిత్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకునే చేసాడు. యాక్షన్ బ్లాక్‌లు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు నుండి ఇంటర్వెల్ బ్లాక్ వరకు గూస్ బమ్స్ తెప్పిస్తాయి. ఫుల్ ఫీస్ట్ లాగా అనిపిస్తుంది. కానీ కథ పెద్దగా లేదు. ఇక రెండవ అర్ధభాగం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సూపర్బ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ తర్వాత పెద్దగా ఏమీ అందించదు అలాగే కాస్త సాగతీసినట్టుగా అనిపిస్తుంది. ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉండదు. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్.
జీవి ప్రకాష్ బీజీఎమ్ బాగుంది. బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ ఇటీవలి కాలంలో అజిత్ నుండి వచ్చిన బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. ఓవరాల్ ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్ ఫర్ అజిత్ ఫ్యాన్స్.. ఒకే ఫర్ ఆడియెన్స్.. బ్యాడ్ ఫర్ అజిత్ హేటర్స్.