సినిమా సెలబ్రిటీలు అరవై ఏళ్ల వయసులో కూడా పెళ్లిళ్లు చేసుకుని అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇలా లేటు వయసులో ప్రేమలో పడటం పెళ్లిళ్లు చేసుకోవడం ఇప్పుడు ట్రెండ్ అవుతుందని చెప్పవచ్చు..ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలలో విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు ఆశిష్ విద్యార్థి రూపాలి అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఈ విధంగా ఈయన 60 సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకోవడంతో ఈ పెళ్లి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ విధంగా ఆశిష్ విద్యార్థి రూపాలిని ఈ వయసులో పెళ్లి చేసుకోవడం వెనుక ఓ బలమైన కారణముందని తెలుస్తోంది. పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే… తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆశిష్ విద్యార్థి తన రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ తన రెండవ పెళ్లి అంత ఈజీగా ఏమీ జరగలేదని ఆయన తెలిపారు. ఈ పెళ్లి సమయంలో తాను ఎంతో బాధను అనుభవించానని తెలియజేశారు. గత ఏడాది జరిగిన వ్లాగింగ్ అసైన్మెంట్ లో భాగంగా నేను రూపాలిని కలిశానని ఆశిష్ తెలియజేశారు.ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయమే ఏర్పడటం ఒకరితో ఒకరు చాటింగ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక రూపాలి కూడా ఐదు సంవత్సరాల క్రితం తన భర్తను కోల్పోయి ఎంతో బాధను అనుభవించిందని కూడా తెలిపారు.ఇలా భర్త మరణం నుంచి బయటపడిన రూపాలి తనుకు దగ్గర అయిందని, ఇలా ఒకరోజు చాట్ చేసుకుంటూ ఉండగా తనని నా జీవితంలోకి ఆహ్వానించి తనతో జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నానని చెప్పాను. ఆమె కూడా నా నిర్ణయానికి ఒప్పుకొని నాతో జీవితం పంచుకుందని ఇలా రూపాలి తన జీవితంలోకి రావడం తనకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని ఆశిష్ విద్యార్థి వెల్లడించారని సమాచారం