Is Donating huge number of Adipurush Free tickets practically possible: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తూ ఉండడం కృతి సనన్ సీత పాత్రలో నటిస్తూ ఉండడమే కాక బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాని డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేయగా బాలీవుడ్ నటి నటులు కీలక పాత్రలలో నటించారు. టీ సిరీస్ సంస్థతో కలిసి డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాని దాదాపు 550 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. పూర్తిస్థాయిలో విఎఫ్ఎక్స్, మోషన్ క్యాప్చర్ గ్రాఫిక్స్ టెక్నాలజీ ఉపయోగించి ఈ సినిమాని తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరిగిపోతూ వెళుతున్నాయి. దానికి తోడు ఈ సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తున్నామంటూ కొందరు సెలబ్రిటీలు చేస్తున్న ప్రకటనలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
ముందుగా ఈ సినిమాని అందరూ చూడాలని ఉద్దేశంతో పదివేల ఫ్రీ టికెట్లను అనాధ శరణాలయాలకు ఇస్తామని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. ఆయన పదివేల టికెట్లు ఇస్తామని ప్రకటించిన కొద్ది రోజులకు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కూడా 10,000 టికెట్లు ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు వారి బాటలోనే కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా కూడా పదివేల ఆది పురుష్ టికెట్లను సినిమా టికెట్ డబ్బులు పెట్టి చూడలేని వారి కోసం పదివేల టికెట్లు ఇస్తానని ప్రకటించింది. ఇప్పుడు వాటన్నింటినీ తలదన్నే విధంగా శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాసరావు ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి రామాలయానికి 101 టికెట్లు ఇస్తానని ప్రకటించారు.
Also Read: Bhola Shankar: తెలుగులో పోటీ లేదు అయినా ‘భోళా శంకర్’కి పెద్ద పరీక్షే?
అంటే ఒక్కొక్క రామాలయానికి 101 టికెట్లు చొప్పున ఖమ్మం జిల్లాలో ఉన్న 1103 రామాలయాలకు లెక్కిస్తే దాదాపు లక్షకు పైగానే టికెట్లు ఇవ్వాల్సి వస్తోంది. ఇక ఇప్పుడు భూమా మౌనిక, మంచు మనోజ్ దంపతులు కూడా తమ తరఫున 2500 టికెట్లను ఇస్తామని ప్రకటించారు. అంటే ఇప్పటి వరకూ ఫ్రీగా టికెట్లు ఇస్తామని ప్రకటించిన వాటిని లెక్కిస్తే 1,32,500 పైగా ఫ్రీ టికెట్లు ఇస్తామని వేరువేరు వ్యక్తులు ప్రకటించినట్లయింది. ఒక్కొక్క టికెట్ ధర యావరేజ్ గా 150 రూపాయలు వేసుకున్నా సరే ఈ టిక్కెట్ల ధర మొత్తం కలిపి కోటి 98 లక్షల 75 వేల రూపాయల ఫ్రీ టికెట్లు ప్రకటించినట్లు అయింది.
Also Read: Nikhil ‘Spy’ release: నిఖిల్ ‘స్పై’ రిలీజ్ డేటుపై భేదాభిప్రాయాలు..చెప్పిన డేటుకు డౌటే?
శ్రేయాస్ శ్రీనివాస్ లక్ష టికెట్ల విషయంలో కాస్త లెక్కలు అటూ ఇటూ అవ్వవచ్చు కానీ దాదాపు కోటి 50 లక్షల విలువ గల ఫ్రీ టికెట్లు ఇవ్వడం కుదిరే పనేనా అనే చర్చలు జరుగుతున్నాయి. అసలు ఆది పురుష్ సినిమాకి కేటాయించే థియేటర్లు ఎన్ని? ఆ థియేటర్లలో సీట్లు ఎన్ని ఉంటాయి? వాటిని ఫ్రీగా పంచిపెడితే ఎన్ని రోజులపాటు ఈ సినిమాను నడపాల్సి ఉంటుంది? లాంటి లెక్కలన్నీ వేస్తే ఇన్ని ఫ్రీ టికెట్లు ప్రకటించడం వరకు బాగానే ఉంది కానీ ఎంతవరకు ఆచరణ సాధ్యమవుతుంది అనేది సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేమని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.