Nikhil ‘Spy’ release: నిఖిల్ ‘స్పై’ రిలీజ్ డేటుపై భేదాభిప్రాయాలు..చెప్పిన డేటుకు డౌటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikhil Siddharth’s ‘Spy’ release in trouble: అర్జున్ సురవరం, కార్తికేయ 2 వంటి సినిమాలతో హిట్లు కొట్టిన నిఖిల్ సిద్దార్థ్ 18 పేజెస్ సినిమా నిరాశ పరిచినా ప్యాన్ ఇండియా క్రేజ్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల మీద ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన నుంచి ఎలాంటి సినిమా వస్తుందా? అనే అంశం మీద వారంతా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఆయన స్పై అనే ఒక ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. తెలుగు యాక్షన్ స్పై థ్రిల్లర్ ను కె. రాజశేఖర్ రెడ్డి రాసిన కథను ఆధారంగా చేసుకుని గ్యారీ బిహెచ్ దర్శకత్వం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ , ఐశ్వర్య మీనన్ , ఆర్యన్ రాజేష్ , సన్యా ఠాకూర్, అభినవ్ గోమతం సహా మకరంద్ దేశ్‌పాండే కీలక పాత్రలలో నటించారు.
Also Read: Adipurush: ‘ఆదిపురుష్’ టికెట్ రేట్లు పెంచండి ప్లీజ్.. ఏపీ సీఎంను కోరనున్న నిర్మాతలు?
Also Read
Also Read: AAA Cinemas: అల్లు అర్జున్ థియేటర్ లాంఛ్ ఆ రోజే.. ఎవరి చేతుల మీదుగా అంటే?
నిజానికి నిఖిల్ పాన్ ఇండియా క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా OTT హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. నిజానికి, నిర్మాత ఓటీటీ రైట్స్ ద్వారా చాలా వరకు ప్రొడక్షన్ ఖర్చులను రికవరీ చేసేశారు. అయితే ఇప్పుడు విడుదల తేదీని వెనక్కి జరిపితే సదరు OTT కంపెనీ ఆ మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరిస్తుందని నిర్మాత భయపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నిఖిల్ మాత్రం సినిమా రిలీజ్ వాయిదా వేసి ఉత్తర భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సినిమాను ప్రమోట్ చేయాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో విడుదల తేదీ విషయంలో నిర్మాత, నిఖిల్ సిద్ధార్థ్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే రిలీజ్ డేట్ వివాదంలో ఉందని, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద సందిగ్ధత ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏమవుతుంది అనేది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!