Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Teja: ‘ఇరుముడి’ సినిమా సక్సెస్ నేపథ్యంలో నిర్వహించిన వేడుకలో హీరో రవితేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు శివపై తనకున్న నమ్మకం, ఆయన వ్యక్తిత్వం, సినిమా కోసం చేసిన కృషిని రవితేజ కొనియాడారు. సినిమాలో భార్గవ్, కిషోర్, కొమరం తదితరులు అద్భుతంగా నటించారని రవితేజ అన్నారు. ఇలాంటి నటులతో ప్రత్యేకమైన పాత్రలు చేయించడం దర్శకుడు శివ కాన్ఫిడెన్స్, కన్విక్షన్‌కు నిదర్శనమని ప్రశంసించారు. రమేష్ ఇంద్ర, శ్వాసిక, అజయ్ ఘోష్, ప్రణీత తదితరులు తమ పాత్రల్లో మెప్పించారని తెలిపారు. ముఖ్యంగా శ్వాసిక అద్భుతంగా నటించిందంటూ సరదాగా ప్రశంసలు కురిపించారు. సామ్ సహా యువ నటీనటులకు మంచి భవిష్యత్ ఉందని ఆకాంక్షించారు. సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులను కూడా రవితేజ అభినందించారు. సినిమాటోగ్రాఫర్ విష్ణు అద్భుతమైన విజువల్స్ అందించారని చెప్పారు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ మధ్య మంచి అనుబంధం ఉంటే సినిమా మరింత బాగా వస్తుందని, విష్ణుతో మరోసారి కలిసి పనిచేయాలని ఉందని తెలిపారు. ఆయన పాజిటివ్ నేచర్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.
సీలేరు షూటింగ్ సమయంలో చిత్రబృందానికి అన్నీ దగ్గరుండి చూసుకున్న దినేష్‌ను రవితేజ అభినందించారు. మొదటి షెడ్యూల్లో కొంత ఇబ్బంది పడినా, ఆ తర్వాత పరిస్థితులకు అలవాటు పడి అద్భుతంగా పనిచేశారని అన్నారు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు బాబా భాస్కర్, శేఖర్ థాంక్యూ చెప్పారు. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్‌లతో తాను ఎన్నో సినిమాలు చేశానని, దాదాపు తన సినిమాల్లో 80 శాతం వరకు వారే పనిచేశారని గుర్తుచేసుకున్నారు. క్లైమాక్స్‌లో యాక్షన్‌ను అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. అలాగే ఫైట్ మాస్టర్ సతీష్ ఎనర్జీ, ఫిట్నెస్ను రవితేజ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఫిట్నెస్ను ఎప్పటికీ వదులుకోవద్దని సూచించారు. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్‌ను ‘ఇరుముడి’కి సోల్‌గా అభివర్ణించారు రవితేజ. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎంతో బలాన్నిచ్చిందన్నారు. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో వచ్చిన రీల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల్లో భావోద్వేగాన్ని పెంచాయని చెప్పారు. కొన్ని సన్నివేశాలు, సంగీతం చూసి తన కుటుంబ సభ్యులు కూడా భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు. జి.వి. ప్రకాశ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
Also Read
నిర్మాతలు నవీన్, రవి తనకు నిర్మాతల కంటే మంచి స్నేహితుల్లాంటి వారని రవితేజ చెప్పారు. సినిమా సక్సెస్ తర్వాత నవీన్ తెల్లవారుజామున 5:30 గంటలకే ఫోన్ చేసి తన ఆనందాన్ని పంచుకుంటున్నారని సరదాగా చెప్పారు. సినిమా విడుదలైన రోజు కూడా నవీన్ తనను హగ్ చేసుకున్న తీరు చూస్తే ఆయన ఆనందం అర్థమైందన్నారు. దర్శకుడు శివను హగ్ చేసుకున్నప్పుడు ‘కింగ్ కాంగ్’ సినిమాలోని సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ రవితేజ సరదాగా వ్యాఖ్యానించారు. నవీన్, రవితో కలిసి ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఉందన్నారు. ‘ఇరుముడి’ కథ తనను మొదటి నుంచే ఆకట్టుకుందని రవితేజ తెలిపారు. పాండమిక్ సమయంలో తమిళ, మలయాళ సినిమాలను ఎక్కువగా చూశానని, ముఖ్యంగా వెట్రిమారన్, మారి సెల్వరాజ్, అమీర్, భారతీరాజా, భారతి చంద్ర వంటి దర్శకుల రూటెడ్ సినిమాలు తనను ప్రభావితం చేశాయని చెప్పారు. అలాంటి కథలు తెలుగులో కూడా రావాలని అప్పట్లో అనుకునేవాడినని తెలిపారు. ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలను చూసే విధానం, సోషల్ మీడియాలో ఇస్తున్న స్పందన తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ‘ఇరుముడి’ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే కనిపిస్తోందని చెప్పారు. 80 ఏళ్లు దాటిన కొందరు కూడా 20-25 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్‌కు వచ్చి సినిమా చూశారని తెలుసుకుని ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు. సినిమా ఎడిటింగ్ రూమ్‌లో తొలిసారి చూసినప్పుడే తాను ఊహించని విధంగా ఎమోషనల్ అయ్యానని రవితేజ వెల్లడించారు. సాధారణంగా తనకు త్వరగా కన్నీళ్లు రావని, తనది స్టోన్ హార్ట్ లాంటిదని సరదాగా చెప్పిన ఆయన.. ‘ఇరుముడి’లోని చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించేంత భావోద్వేగంగా ఉన్నాయని అన్నారు.
దర్శకుడు శివ తనకు కథ చెప్పినప్పుడు త్రినాథ్ పాత్ర తొలుత నచ్చలేదని, అయితే ‘ఇరుముడి’ అనే టైటిల్, కథ మొత్తం విన్న తర్వాత సినిమాపై నమ్మకం ఏర్పడిందని తెలిపారు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఇది సూపర్‌హిట్ అవుతుందని శివ చెప్పేవాడని, ఏదైనా తేడా వస్తే ఊరికి వెళ్లిపోతానని కూడా చెప్పినట్లు గుర్తుచేశారు. శివ నమ్మకం ఇప్పుడు నిజమైందని రవితేజ అన్నారు. సినిమా క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు ఎంతో ఎమోషనల్ అవుతున్నారని, చివరి 20 నిమిషాల్లో థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా దర్శకుడు శివను వేదికపైకి పిలిచి హగ్ చేసుకున్నారు. ఇంత గొప్ప సినిమా ఇచ్చినందుకు మాత్రమే కాకుండా.. శివలోని నిజాయితీ, వ్యక్తిత్వం, కాన్విక్షన్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. భారీ విజయం సాధించినా శివలో ఎలాంటి మార్పు రాలేదని, గతంలో ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడని ప్రశంసించారు. నిర్మాతలు నవీన్, రవి, దర్శకుడు శివకు రవితేజ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇరుముడి’లాంటి అద్భుతమైన సినిమాలో భాగం చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. అలాగే హీరోయిన్ ప్రియను కూడా ప్రశంసించారు. సెకండ్ హాఫ్‌లో ఆమె చేసిన కీలక సన్నివేశం చాలా బాగా వచ్చిందని, ఒక ఆర్టిస్ట్ మాత్రమే చేయగలిగే పాత్రను ఆమె అద్భుతంగా పోషించిందన్నారు. నక్షత్రను ‘బేబీ సూపర్‌స్టార్’గా అభివర్ణించిన రవితేజ.. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, సినిమా చూసిన వారికి ఇప్పటికే అర్థమైందన్నారు. ఆమెకు మంచి భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. శివ తండ్రి గురించి చెప్పిన విషయాలు తనకు ముందుగా తెలియవని, ఆయన తల్లి గొప్ప వ్యక్తి అంటూ ప్రస్తావించారు. చివరగా ‘ఇరుముడి’ విజయాన్ని పురస్కరించుకుని రవితేజ, నిర్మాతలు నవీన్, రవి, దర్శకుడు శివ తదితరులతో కలిసి కేక్ కట్ చేశారు. సినిమా విజయంలో కథే తనకు ప్రధానమని, కథ ప్రేక్షకులను నిరంతరం ముందుకు తీసుకెళ్లేలా ఉండాలని తాను నమ్ముతానని రవితేజ తెలిపారు.
తాజావార్తలు
-
OTR: దువ్వాడ శ్రీనివాస్ అడుగులు మళ్లీ వైసీపీ వైపు పడుతున్నాయా..?
-
AP High Court: విశాఖ డేటా సెంటర్‌పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!