Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమాలో రవితేజ కూతురు ‘మానమ్మ’ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర తన క్యూట్ అండ్ ఎమోషనల్ యాక్టింగ్‌తో ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ వేడుకలో వేదికెక్కిన నక్షత్ర.. ఆనందం, ఉద్వేగం తట్టుకోలేక ఎమోషనల్ అయింది. టెన్షన్ పడుతూనే ముద్దు ముద్దు మాటలతో ఈ చిన్నారి చెప్పిన థాంక్స్ స్పీచ్ ఇప్పుడు అందరి మనసుల్ని గెలుచుకుంటోంది. “అందరికీ హాయ్.. సినిమా బ్లాక్ బస్టర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా, ఎమోషనల్‌గా ఉంది. నాకింత సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ. నిజం చెప్పాలంటే ఇక్కడ నాకు కాస్త భయంగా, కన్ఫ్యూజన్గా ఉంది..” అంటూ దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటూ తన లోపలి టెన్షన్‌ను క్యూట్‌గా బయటపెట్టింది.
ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ నక్షత్ర చూపించిన పరిణతి అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. “నన్ను మీ ‘మణమ్మ’గా అంగీకరించి, మీ గుండెల్లో నాకు ఓ ప్రత్యేకమైన స్థానం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ థాంక్యూ. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ శివ అన్నకు చాలా థాంక్స్. అలాగే మా అమ్మానాన్నలకు.. లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ” అంటూ వేదికపై నుంచే తన ఆన్ స్క్రీన్ తల్లిదండ్రులపై ప్రేమను కురిపించింది. తనకు సపోర్ట్ చేసిన సాంకేతిక నిపుణులను కూడా ఈ చిన్నారి మర్చిపోలేదు. సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మకు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవిశంకర్ కు, అలాగే డబ్బింగ్ ఇంజనీర్ వేణుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ గురించి చెబుతూ.. “జీవీ ప్రకాష్ తన మ్యూజిక్ తో సినిమాలో ప్రతి సీన్‌ను మరింత ఎమోషనల్ గా మార్చేశారు” అని ప్రశంసించింది. చివరగా “స్వామియే శరణం అయ్యప్ప” అంటూ నక్షత్ర తన స్పీచ్‌ను ముగించగానే, ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!