AP High Court: విశాఖ డేటా సెంటర్‌పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: విశాఖ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు వ్యవహారంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డేటా సెంటర్‌కు సంబంధించిన నిర్మాణ పనులు చట్ట నిబంధనలు, పర్యావరణ అనుమతులకు లోబడి మాత్రమే చేపట్టాలని స్పష్టం చేసింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చిచెప్పింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూములను హైపర్ స్కేల్ డేటా సెంటర్ పార్క్‌కు కేటాయిస్తున్నారంటూ పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. డేటా సెంటర్‌కు సమీపంలో అటవీ ప్రాంతం, జలాశయం ఉన్నాయని.. ప్రాజెక్ట్ వల్ల వన్యప్రాణులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ప్రాజెక్ట్ ‘ఏ’ కేటగిరీ కిందకు వస్తుందని.. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని వాదించారు. దేవస్థాన భూములను ఎలా కేటాయించారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. భూములను కేటాయించలేదని.. దేవస్థాన అథారిటీ 11 ఏళ్లకు లీజుకు ఇవ్వనుందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ లీజు ద్వారా దేవస్థానానికి ఏడాదికి 26 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపింది. డేటా సెంటర్ పనులు చట్ట నిబంధనలు, పర్యావరణ అనుమతులకు అనుగుణంగానే చేపడతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో.. ఆ హామీని తప్పనిసరిగా అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది..
Also Read
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
తాజావార్తలు
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!