‘పుష్ప’ మూవీ ఫేమ్ ఫహద్ ఫాజిల్ గురించి పరిచయం అక్కర్లేదు. కామెడీ, సస్పెన్స్, యాక్షన్, లవ్, రొమాంటిక్, ఇలా ఎలాంటి క్యారెక్టర్‌లోనైనా జీవించే అరుదైన నటుల్లో ఒకరిగా తనని తాను నిరూపించుకున్నాడు. ప్రజంట్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఇక పోతే మలయాళం నుంచి వచ్చే సినిమాలకు ఓటీటీలో సెపరేట్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో రిలీజ్ అవుతున్న సినిమాలు కాకుండా పాత సినిమాలు కూడా ఓటీటీ లోకి అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఫహద్ ఫాజిల్ నటించిన ఓ చిత్రం దాదాపు నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వస్తోంది. అది ఏ సినిమా? అంటే..
Also Read: Chiranjeevi : చిరంజీవి- శ్రీకాంత్ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ..!
నసిఫ్ యూసఫ్ ఐజుద్దీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుళ్’ మూవీ. ఇందులో ఫహద్ ఫాజిల్, సౌబిన్ షాహిర్, దర్శనా రాజేంద్రన్, జిపా జాన్, మస్హర్ హంసా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్, ప్లాన్ జే స్టూడియోస్ బ్యానర్లపై ఆంటో జోసెఫ్, జామన్ టీ జాన్, షమీర్ మొహమ్మద్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 2 ఏప్రిల్ 2021 న విడుదలకాగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాదాపు నాలుగేళ్ల కావొస్తున్నా ఈ సినిమా తెలుగులో మాత్రం అందుబాటులోకి రాలేదు. ఇక తాజాగా ఈ సినిమాను ఓటీటీలో తెలుగు వెర్షన్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇరుళ్’ పేరుతో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని ‘అపరాధి’ పేరుతో ఆహా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మే 8 నుంచి ఈ సినిమా తెలుగులో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. మరి ఈ ‘అపరాధి’ తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.