ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రాల్లో ‘గాడ్ ఫాదర్’ ఒకటి. మలయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో నటిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను నేడు రంజాన్ సందర్భంగా రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమా కోసం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాను రంగంలోకి దింపారు.
‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ అతిధి పాత్రలోనే కాకుండా ఒక సాంగ్ లో కూడా కనిపించనున్న విషయం విదితమే. ఇప్పుడు ఆ సాంగ్ బాధ్యతలు ప్రభుదేవా తీసుకున్నాడు. కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా స్టైల్ ఏంటో అందరికి తెలుసు.. ఇక చిరు స్టెప్పులు, ఆగ్రెస్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరితో పాటు సల్లు భాయ్ స్పెషల్ డాన్స్ కూడా అందరికి పరిచయమే.. ఈ ముగ్గురు కాంబో లో వస్తున్న ఈ సాంగ్ ఎంత ప్రత్యేకంగా ఉండబోతుందో ఊహించుకుంటుంటేనే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ మరియు ప్రభుదేవా కాంబోలో ఒక సాంగ్ వచ్చి చాలాకాలం కావడం కూడా ప్రత్యేకమైన విషయమనే చెప్పాలి. మరి ఈ పాట ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Yayyyy !! ❤️
THIS IS NEWS 🎬🧨💞 @PDdancing Will Be Choreographing An Atom Bombing Swinging Song For Our Boss @KChiruTweets and @BeingSalmanKhan Gaaru What A High Seriously @jayam_mohanraja Our Mighty #GodfatherMusic #Godfather
This is GONNA LIT 🔥 THE Screens For Sure 😍 pic.twitter.com/H618OaI9b6
— thaman S (@MusicThaman) May 3, 2022