మార్క్ ఆంటోనీతో వంద కోట్లను కొల్లగొట్టిన అధిక్ రవిచంద్రన్ తన అభిమాన హీరో అజిత్‌తో గుడ్ బ్యాడ్ అగ్లీకి వర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కాగా, ఏప్రిల్ 10న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను షురూ చేశారు. అజిత్ సరసన ఆరో సారి జోడీ కడుతోంది త్రిష. రీసెంట్లీ త్రిష క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేసే వీడియోను వదిలారు. ఇందులో త్రిష రమ్య పాత్రలో కనిపించబోతుంది. ఇక్కడే అధిక్ సెంటిమెంట్ ఒకటి బయటపడింది.
Also Read : Shalini Pande : ఓటీటీలకు ప్రాధాన్యతనిస్తోన్న షాలిని పాండే
అధిక్ రవిచంద్రన్ హీరోయిన్ల నేమ్ విషయంలో ఒకటే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. ఇప్పటి వరకు ఐదు సినిమాలు తీస్తే అన్నింటిలోనూ హీరోయిన్ నేమ్ రమ్యనే ఉండటం గమనార్హం. ఫస్ట్ మూవీ త్రిష ఇల్లానా నయనతార, రీసెంట్ సినిమా మార్క్ ఆంటోనీ, అప్ కమింగ్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ వరకు అదే పేరును ఫాలో అయిపోతున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన నెటిజన్స్ రమ్య పేరు పెట్టడానికి రీజన్స్ ఏంటీ అధిక్ అంటూ టీజ్ చేస్తున్నారు.ఈ దర్శకుడికి రమ్య అనే పేరు ఓ సెంటిమెంటని న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. బహుశా ప్రమోషన్స్ టైమ్ లో ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. ఇక సినిమా విషయానికి వస్తే అజిత్ ఫ్యాన్స్ గుడ్ బ్యాడ్ అగ్లీపై ఓ రేంజ్‌లో ఎక్స్ పర్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ అంచనాలు తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు అధిక్ రవిచంద్రన్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రెస్టిజియస్‌గా తెరకెక్కించింది. మరీ అభిమానులు ఆశించిన స్థాయిలో అధిక్ సినిమాను నిలబెడతాడా. రమ్య సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.