గోవా బ్యూటీ ఇలియానా తాజాగా మరోసారి బాడీ షేమింగ్, బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్‌తో బాధపడటం గురించి నోరు విప్పింది. గత ఏడాది కూడా ఇలియానా బాడీ షేమింగ్ తో బాధపడినట్టు వెల్లడించింది. బాడీ షేమింగ్ కారణంగా ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై క్లారిటీ ఇచ్చింది ఇల్లీ బేబీ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనలు వచ్చినట్టు అంగీకరించింది. కానీ దానికి కారణం వేరని స్పష్టం చేసింది.
Read Also : KGF Chapter 2 : బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్… మరో పార్ట్ లోడింగ్
ఓ మీడియా పోర్టల్ తో తాజాగా ఇలియానా మాట్లాడుతూ “నేను గతంలో ఒక ఆర్టికల్‌ని చదివాను. అది ఎవరు రాశారో గుర్తులేదు కానీ అందులో అవసరమైన విషయాన్ని పక్కన పెట్టేసి, అనవసరమైన విషయాలను రాశారు. 12 ఏళ్ల వయసు నుంచే నాకు శరీర సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వచ్చాను. ఇక ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు వచ్చిన మాట కూడా నిజమే. కానీ దానికి బాడీ షేమింగ్ లేదా నా శరీరాకృతి కారణం కాదు. అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా డిప్రెషన్ లోకి వెళ్ళాను. అయితే సంబంధం లేని ఈ రెండు విషయాలను ముడిపెట్టి రాయడం నాకు నచ్చలేదు. పైగా చిరాకు కలిగించింది” అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది ఇలియానా.