ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ KGF Chapter 2 సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈరోజు బిగ్ స్క్రీన్‌పైకి వచ్చింది. యష్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలై, మంచి స్పందనను రాబట్టుకుంటోంది. రాఖీ భాయ్ ప్రపంచంలోని వయోలెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సంజయ్ దత్ విలన్ గా అధీర పాత్రతో సౌత్ లో అరంగేట్రం చేసాడు. రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, శ్రీనిధి శెట్టి, రావు రమేష్, ఈశ్వరీ రావు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. నేడు బిగ్ స్క్రీన్లలో హంగామా చేస్తున్న KGF Chapter 2 మూవీ ఎండింగ్ లో బిగ్ అనౌన్స్మెంట్ తో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు మేకర్స్.
Read Also : Acharya : కాజల్ రోల్ కత్తిరించేశారా ?
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా ? ఉండదా ? అనే విషయంపై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. KGF Chapter 2 ప్రమోషన్లలోనూ సీక్వెల్ పై టీంకు ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఫస్ట్ ఈ మూవీ విడుదలై, రిజల్ట్ రానీయండి అంటూ సమాధానం దాటవేసిన ప్రశాంత్ నీల్… సినిమా ఎండింగ్ లో మాత్రం KGF Chapter 3 లోడింగ్ అంటూ అధికారికంగా ప్రకటించి, అభిమానులను థ్రిల్ చేశారు. దీంతో ఒకవైపు థియటర్లలో KGF Chapter 2 జాతర జరుగుతుండగా, మరోవైపు KGF Chapter 3పై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి.