Hyper Aadi: జబర్దస్త్ నటుడు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హైపర్ ఆది.. మెగా కుటుంబానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద అభిమానినో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ నడిపిస్తున్న జనసేన పార్టీలో హైపర్ ఆది కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక పవన్ గురించి కానీ, లేక చిరంజీవి గురించి కానీ ఎవరైనా ఏదైనా విమర్శించినా.. నిర్మొహమాటంగా వారిని మీడియా ముందే ఏకిపారేస్తాడు. ఇక తాజాగా భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది మరోసారి పవన్ పై విమర్శలు గుప్పించిన ఒక డైరెక్టర్ పై విరుచుకుపడ్డాడు. అతను ఎన్నీ వ్యూహాలు వేసినా ఫలించబోయేవి లేదని ఖరాకండీగా చెప్పుకొచ్చాడు. ఇక వ్యూహం అని నొక్కి చెప్పడంతోనే ఆ డైరెక్టర్ ఎవరో అర్థమైపోయింది అంటున్నారు. అతనే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
Game Changer : ఆ పాట కోసం భారీగా ప్లాన్ చేస్తున్న దర్శకుడు శంకర్..?
మొదటి నుంచి కూడా వర్మ.. వీలు దొరికినప్పుడల్లా పవన్ పై ట్విట్టర్ లో విరుచుకుపడుతూ ఉంటాడు. ఈ విషయం అందరికి తెల్సిందే. అయితే మెగా కుటుంబం కానీ, పవన్ కళ్యాణ్ కానీ.. ఏ రోజు వర్మ కామెంట్స్ కు స్పందించింది లేదు. అప్పుడప్పుడు పవన్ అభిమానులు మాత్రమే వర్మపై నోరు పారేసుకుంటారు. ఇక ఈ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ.. ” టాలీవుడ్ లో ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయనను అనే స్థాయి నాకు లేదు. కానీ, మెగా కుటుంబాన్ని అనే స్థాయి ఆయనకు కూడా లేదని గుర్తుంచుకుంటే మంచిది. చిన్న పెగ్ వేసినప్పుడు మెగాస్టార్ ను.. పెద్ద పెగ్ వేసినప్పుడు పవర్ స్టార్ ను విమర్శిస్తూ ఉంటాడు. అర్ధం లేని మాటలకు క్లాప్స్ రావు అన్నది ఎంత నిజమో.. అర్ధం లేని సినిమాలకు కలక్షన్స్ రావు.. నాకు తెలిసి మీ వ్యూహాలు బెడిసికొడతాయని” ఇన్ డైరెక్ట్ గా వర్మకు వార్నింగ్ ఇచ్చాడు హైప్ ఆది. ప్రస్తుతం ఈ స్పీచ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే జగన్ కథతో వర్మ వ్యూహం అనే తీస్తున్న విషయం తెల్సిందే. మరి ఈ సినిమా ఎలాంటి అటెన్షన్ ను గ్రాబ్ చేస్తుందో చూడాలి.