War 2 : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్-2 ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. అప్పటి నుంచి మూవీ టీమ్ స్పందించలేదు. తాజాగా హృతిక్ రోషన్ ఈ డిజాస్టర్ మీద పోస్టు పెట్టారు. ఒక నటుడిగా నేనేం చేయాలో అదే చేశాను. ఏ పని అయినా సరే నేను సింపుల్ గానే చేస్తాను. వార్-2 గురించి నాకు మొత్తం తెలుసు కాబట్టి సినిమాను చాలా ఈజీగా చేయగలిగాను. అందుకే ప్రతి దాన్ని సీరియస్ గా తీసుకోకండి. ఈజీగానే తీసుకోండి. ఎందుకంటే పని చేయడం వరకే మన చేతుల్లో ఉంటుందన్నాడు హృతిక్.
Read Also : IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్.. భారత్ ఘన విజయం
అన్ని సినిమాలు హిట్ అవుతాయనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే పని చేగలుగుతాం కానీ.. ప్రతిఫలం ప్రేక్షకులే ఇస్తారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ మూవీ జరిగినన్ని రోజులు నన్ను బాగా చూసుకున్నారు. ఆయన ఎనర్జీ చూసి నాకు కూడా అద్భుతంగా చేయాలని ఉండేది. కానీ కొన్ని ఇలా జరిగినప్పుడు పాజిటివ్ గానే తీసుకోవాలి. ఎందుకంటే హిట్లు, ప్లాపులు అనేవి నా చేతుల్లో లేవు. అన్ని సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకంతోనే చేస్తాం. కానీ ఫలితం ఎలా వచ్చినా దాన్ని పాజిటివ్ గానే తీసుకోవాలి అని చెప్పుకొచ్చాడు హృతిక్.