Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Hombale With 8 Movies From The South

Hombale Films :దక్షిణాదిన 8 సినిమాలతో హోంబలే భలేభలే!

Published Date :June 13, 2022 , 2:04 pm
By Subbarao N
Hombale Films :దక్షిణాదిన 8 సినిమాలతో హోంబలే భలేభలే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇవాల్టి రోజుల్లో ఒక సినిమా హిట్ అయితే జబ్బలు చరుచుకుంటూ అంతా తమ గొప్పే అని చాటింపు వేసుకునే రోజులు ఇవి. అయితే ‘కెజిఎఫ్‌, కెజిఎఫ్2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి కూడా హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సినిమా మీద సినిమా ప్రకటిస్తూ సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ పోతున్నారు. ఈ బ్యానర్ లో వచ్చిన తొలి సినిమా పునీత్ రాజ్ కుమార్ నటించిన ‘నిన్నిండలే’. దీనికి మన జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత యశ్ తో ‘మాస్టర్ పీస్’ తీశారు. మూడో సినిమాగా పునీత్ తో తీసిన ‘రాజకుమార’ ఆ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఆపై చరిత్ర మొదలైంది. యశ్, ప్రశాంత్ నీల్ తో ‘కెజిఎఫ్‌’ తీశారు. అది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ‘కెజిఎఫ్‌2’ కి ముందు పునీత్ చివరి సినిమాగా విడుదలైన ‘యువరత్న’ ను నిర్మించింది కూడా హోంబలే ఫిల్మ్ సంస్థే. ఈ ఏడాది వచ్చిన ‘కెజిఎఫ్‌2’ ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి వెయ్యి కోట్లకు పైగా పోగేయటం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సంస్థ తీస్తున్న సినిమాలలో ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ఉండటం గమనార్హం. అందులో మొదటిది ప్రభాస్ తో తీస్తున్న ‘సలార్’.

ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్. ఇక ఈ ఏడాది ఆగస్ట్ 5న విడుదల కాబోతున్న జగ్గేశ్, శ్వేత శ్రీవాత్సవ్ సినిమా ‘రాఘవేంద్రస్టోర్స్’, రిషిబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘కాంటారా’ ఇదే ఏడాది పెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ నటించి దర్శకత్వం వహిస్తున్న ‘టైసన్’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రశాంత్ నీల్ రచనతో శ్రీమురళి హీరోగా ‘భగీరా’ షూటింగ్ దశలో ఉంది. ‘లూసియా’ ఫేమ్ పవన్ కుమార్ తో కూడా ఓ సినిమా చేస్తున్నారు. నిజానికి ఇందులో పునీత్ రాజ్ కుమార్ నటించాల్సింది. ఆయన లేరు కాబట్టి మరో హీరోతో ప్రొసీడ్ కానున్నారు. రక్షిత్ శెట్టి డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘ఉలిదవరు కందంతే’ కి సీక్వెల్ గా ‘రిచర్డ్ ఆంటోని’ సినిమాను తెరకెక్కిస్తోంది హోంబలే ఫిలిమ్స్. ఇవి కాకుండా సుధాకొంగర దర్శకత్వంలో మూవీ చేయటానికి కమిట్ అయింది. మరి వరుసగా నాన్ స్టాప్ గా సినిమాలు ప్లాన్ చేస్తూ దక్షిణాదిన ఒకే సారి 8 సినిమాలు నిర్మిస్తున్న ఏకైక సంస్థగా ముందుకు సాగుతున్న హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాలతో ఏ స్థాయి విజయాలను అందుకుంటుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hombale Films
  • Latest Movies
  • South Films
  • Tollywood
  • Vijay Kiragandur

తాజావార్తలు

  • World Backup Day 2026: ఈ 5 రకాల డేటాను క్లౌడ్‌లో స్టోర్ చేస్తున్నారా?.. ఎంత డేంజరో తెలుసా?

  • Explosion in Police Station: పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఎస్సై సహా ముగ్గురికి తీవ్రగాయాలు.!

  • Trump-Bangladesh: మాకు రష్యా చమురు కొనుగోలుకు అనుమతివ్వండి.. ట్రంప్‌కు బంగ్లాదేశ్ విజ్ఞప్తి

  • LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ సెన్సార్ కంప్లిట్..

  • Kathanar : అనుష్క లేటెస్ట్ సినిమా ‘కథనార్’ ట్రైలర్ రిలీజ్

ట్రెండింగ్‌

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions