స్పైడర్ మాన్: హోమ్ కమింగ్, స్పైడర్ మాన్: ఫార్ ఫ్రమ్ హోమ్, స్పైడర్ మాన్: నో వే హోమ్ సినిమాలతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు హీరోయిన్ ‘జెండాయ’, హీరో టామ్ హాలండ్. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ సెలబ్రిటీ కపుల్ నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం ఇటీవలే ముంబైకి వచ్చారు. ఈ సందర్భంగా ఇండియన్ ఎటైర్ లో జెండాయ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇండియాలో తన ఫస్ట్ ట్రిప్ గురించి, తనకి నచ్చిన విషయాల గురించి టామ్ హాలండ్ హార్ట్ ఫుల్ గా మాట్లాడిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో టామ్… “ఇండియాలో నేను, జెండాయ సూపర్బ్ టైమ్ స్పెండ్ చేసాం. అది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వెకేషన్. నేను మళ్లీ ఇండియాకి రావడం కోసం ఎదురు చూస్తున్నాను. గ్రేట్ పీపుల్ ని మీట్ అయ్యాను. అంబానీ కల్చరల్ సెంటర్ చాలా బాగుంది. ఇండియా ట్రిప్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని ఇచ్చింది” అని చెప్పాడు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి కూడా మాట్లాడిన ఈ సూపర్ హీరో “నేను ఆర్ ఆర్ ఆర్ చూశాను, నాకు భలే నచ్చింది” అంటూ తన రివ్యూ ఇచ్చేసాడు. స్పైడర్ మాన్ సినిమాల హీరో ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ఇంటర్నేషనల్ స్టేజ్ పైన మాట్లాడడంతో ఈ మూవీ లవర్స్ టామ్ వీడియోని వైరల్ చేసే పనిలో పడ్డారు. ఒక్క సినిమాతోనే రాజమౌళి… వరల్డ్ సినిమా దిగ్గజాలని మెప్పించి, అందరినీ ఇండియా వైపు తిరిగి చూసేలా చేసాడు. ఈసారికి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి వరకే పరిమితం అయిన రాజమౌళి, నెక్స్ట్ ఆస్కార్ బరిలో నిలిచినప్పుడు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్… ఇలా చాలా కేటగిరీస్ ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది.